ఎంతో మందికి సహాయం చేస్తున్న టీ అమ్మే యువకుడు

Advertisement

ఒక వ్యక్తి దగ్గరకు ఒక మహిళా వచ్చి “నాకు సహాయం చేయండి. నా భర్త చనిపోయాడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక ఇన్ని రోజులు నాలుగు ఇండ్లు పని చేసి జీవనం సాగించేదాన్ని.. ఈ కరోనా దాటికి ఆ పని కూడా పోయింది. దీనితో ఇల్లు గడవడం కష్టంగా మారింది. అందుకోసమే ఓ కుట్టు మిషన్ ఇప్పిస్తే తిరిగి నా జీవనాన్ని కొనసాగిస్తా అని వేడుకుంది”. ఇక ఈ విషయాన్నీ అతగాడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. తన పోస్ట్ కు ఒక వ్యక్తి స్పందించి నేను సహాయం చేస్తా అని చెప్పాడు.

ఇక అందుకు కావాల్సిన డబ్బులు పంపుతానని ఆ వ్యక్తితో చెప్పగా.. నాకు డబ్బులు వద్దు సర్ మిరే కుట్టు మిషన్ షాప్ వారికీ పంపించండి అని చెప్పాడు. ఇక చివరకు కుట్టు మిషన్ షాప్ కు పంపగా కుట్టు మిషన్, దారాలు, సూది ఇతర వస్తువులు కొనుక్కొని ఆ మహిళా దగ్గరకు వెళ్లి ఇచ్చాడు ఆ వ్యక్తి. అయితే ఆ మహిళకు సహాయం చేసిన వ్యక్తిని వీడియో కాల్ ద్వారా చూపించాడు. ఇక ఆ సహాయం చేసిన వ్యక్తి అవతలి వ్యక్తిని చూసి ఆశ్చర్య పోయాడు. అయితే అతగాడు ప్రభుత్వ ఉద్యోగో, లేక బాగా సెటిల్ ఆయిన వ్యక్తి కావొచ్చు అని అనుకున్నాడు.

కానీ అతను 25 ఏళ్ళ యువకుడు ఒక సైకిల్ పైన వీధి వీధిన తిరుగుతూ టీ అమ్ముతుంటాడు. అలాగే అతని యజమాని ఎవరైనా తనకు సాయం చేస్తున్నారేమో అని సందేహం కలిగింది కానీ ఎవరూ లేరు. ఇక తన గురించి ఆరా తీయగా.. తన చిన్న తనంలోనే తల్లితండ్రిని కోల్పోయి ఆకలి బాధను అనుభవించాడు. అలాగే పుట్టిన ఊరు వదిలి నా అనేవాళ్ళు లేకపోవడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు.

అయితే ఈ యువకుడు రోజు 20 మందికి సాయం చేస్తాడు. అలాగే ఎవరైనా తనకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన తిరస్కరించి, ఆ సాయాన్ని ఏమి లేని వారికీ అందిస్తుంటాడు. నిజంగా అతడి సాయానికి సలాం కొట్టాలి. తనకు కష్టం విలువ తెలుసు కాబట్టే అందరికి సాయం చేస్తున్నాడు. సాయం చేసే మనుసుకు పేద, ధనిక అని తేడా ఉండదు అనే మాటకు ఈ యువకుడే నిదర్శనం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here