TDP : బీజేపీతో పొత్తు కోసం తెలంగాణ నుండి నరుక్కు వస్తున్న టీడీపీ!
NQ Staff - January 11, 2023 / 06:34 AM IST

TDP : ఏపీలో 2014 తరహా పొత్తుల కోసం జనసేన మరియు తెలుగు దేశం పార్టీ ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడు ఈ రెండు పార్టీలు మరియు బీజేపీ కలిసి అధికారంను దక్కించుకున్నాయి. కొన్ని కారణాల వల్ల మూడు పార్టీలు కూడా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విడి విడిగా పోటీ చేశాయి.
మూడు పార్టీలు వేరుపడి పోటీ చేయడం వల్ల ప్రత్యర్థి వైకాపాకు కలిసి వచ్చి జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. తెలుగు దేశం పార్టీ 2024 ఎన్నికలపై చాలా ఆశలు పెట్టుకుంది. చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని భావిస్తున్నాడు.
అందుకోసం పొత్తులే సరైన మార్గం అన్నట్లుగా ఆయన భావిస్తున్నాడు. జనసేన మద్దతు కూడ గట్టేందుకు ఇప్పటికే ప్రయత్నాలు జరిగాయి. పవన్ కళ్యాణ్ నుండి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ లభించింది. కానీ బీజేపీ మాత్రం తెలుగు దేశం పార్టీ తో కలిసేది లేదు అన్నట్లుగా భీష్మించుకుని ఉంది.
ఏపీలో నాయకులు తెలుగు దేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ సమయంలో తెలంగాణలో తమ యొక్క పట్టు చూపించుకుని.. అక్కడ బీజేపీతో పొత్తుకు ఒప్పిస్తే ఏపీలో కూడా కలిసి వస్తుందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నాడు అనే చర్చ జరుగుతోంది.
తెలుగు దేశం పార్టీ ని తెలంగాణ లో యాక్టివ్ చేస్తే.. తెలంగాణలో అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ కచ్చితంగా టీడీపీ మద్దతు కోరుతుంది. అలా ఏపీలో టీడీపీకి బీజేపీ మద్దతు ఇస్తుందని చంద్రబాబు నాయుడు వ్యూహంగా రాజకీయ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. మరి బీజేపీతో పొత్తు కోసం చంద్రన్న చేస్తున్న ప్రయత్నాలు సఫలం అయ్యేనా చూడాలి.