Nara Brahmani : లోకేష్ కోసం బ్రాహ్మణిని తప్పించారా.. ఎంత పెద్ద స్కెచ్ వేశారు..?

NQ Staff - October 20, 2023 / 10:52 AM IST

Nara Brahmani : లోకేష్ కోసం బ్రాహ్మణిని తప్పించారా.. ఎంత పెద్ద స్కెచ్ వేశారు..?

Nara Brahmani :

స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన నేపథ్యంలో టీడీపీకి ఆయన కోడలు బ్రాహ్మణి నాయకత్వం వహిస్తుందనే ప్రచారాన్ని ఎల్లో మీడియా ఊదరగొట్టింది. తీరా ఆమెకు లీడ్ రోల్ అప్పగిస్తే లోకేష్ పరిస్థితి ఏంటనే ఆలోచనతో మళ్లీ ఆమెను పక్కన పెట్టేశారా? అని సర్వత్రా చర్చ జరుగుతున్నది. లోకేష్ భవిష్యత్ కోసం బ్రాహ్మణిని పక్కన పెట్టేశారని టీడీపీ వర్గాలు సైతం చెబుతుండడం గమనార్హం.

స్కిల్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు అనంతరం టీడీపీకి ఎవరూ నాయకత్వం వహిస్తారనే ప్రశ్న ఉత్పన్నమైంది. అయితే ఆయన తనయుడు లోకేష్ కూడా చంద్రబాబు కేసుల విషయమై చాలా రోజులు ఢిల్లీలో ఉండడంతో.. ఇక టీడీపీకి బ్రాహ్మిణి సారథ్యం వహిస్తుందని అందరూ అనుకున్నారు. మీడియా కూడా అలాగే కోడై కూసింది కూడా..

చంద్రబాబు అరెస్ట్ తో లోకేష్ డీలా పడిపోయారని.. ఇలాగైతే పార్టీని ఎలా నడుపుతారని సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. లోకేష్ ఢిల్లీలో, రాజమండ్రిలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, వారి కోడలు బ్రాహ్మిణి ఉన్నారు. ఇక టీడీపీ సారథ్య బాధ్యతలు బ్రాహ్మిణే మోస్తారని అంతా భావించారు.. అయితే తాజాగా బ్రాహ్మిణిని తప్పించి.. ఇక పోరాటమైనా లోకేష్, భువనేశ్వరి మాత్రమే చేస్తారని ఎల్లో మీడియా ఊదరగొడుతుండి.

అయితే నందమూరి వారసురాలిగా బ్రాహ్మిణి లైవ్ లోకి వస్తే.. నారా కుటుంబానికి ఇక చెల్లు చీటీ అవుతుందని.. లోకేష్ భవితవ్యం దెబ్బతినే అవకాశం ఉందనే అనుమానాలతో ఆమెను పక్కన బెట్టినట్టు తెలుస్తున్నది. చంద్రబాబు తర్వాత నారా వారసుడు లోకేష్ మాత్రమే కావాలని, ఏపీని పాలించేది నారా వారసుడే కావాలని బాబు అభిమానులతో పాటు ఎల్లో మీడియా కాంక్షిస్తున్నది. అయితే దీనికి విరుద్ధంగా చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో .. బ్రాహ్మిణికి అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం ఊదరగొట్టడంతో చంద్రబాబు వర్గం కనుక వహించినట్టు తెలుస్తోంది. ఇలాగైతే లోకేష్ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందనే భయంతో మళ్లీ.. లోకేష్ ను తెరపైకి తీసుకురావడం.. బ్రాహ్మణిని వెనక్కులాగడం జరిగినట్టు తెలుస్తున్నది.

లోకేష్ కు మైలేజీ ఇవ్వడం కోసం ఆయన భార్య అయిన బ్రాహ్మిణికి కూడా క్రెడిట్ ఇవ్వొద్దని ఎల్లో మీడియా ఫిక్స్ అయినట్టు తెలుస్తున్నది. కాబట్టే ఇక నుంచి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, తనయడు లోకేష్ మాత్రమే జగన్ వ్యతిరేక పోరాటంలో ఉంటున్నట్టు హింట్ ఇస్తున్నారు. ‘నిజం గెలవాలి’ అనే పేరుతో భువనేశ్వరి, ‘భవిష్యత్ కు గ్యారెంటీ’ అనే పేరుతో త్వరలోనే యాత్రలు చేయనున్నట్టు తెలుస్తోంది.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us