Chandrababu Naidu : చివరి ఎలక్షన్.! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.!
NQ Staff - November 17, 2022 / 08:39 AM IST

Chandrababu Naidu : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లా పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఇవే నాకు చివరి ఎన్నికలు..’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడంతో అంతా ఆశ్చర్యపోయారు.
‘మీరు నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే.. నన్ను అసెంబ్లీలో దారుణంగా అవమానించారు. నా భార్యను కూడా అవమానించారు. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ..’ అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు.
కౌరవ సభని గౌరవ సభగా మార్చుతా..
‘మీరు నన్ను ఆశీర్వదించి, గెలిపిస్తే ఇప్పుడున్న కౌరవ సభను గౌరవ సభగా మార్చుతాను. మీరు నన్ను గెలిపిస్తే సరే. ఇదే నాకు చివరి ఎన్నిక..’ అంటూ చంద్రబాబు ఉద్వేగంగా ప్రసంగించారు.
‘సీఎం చంద్రబాబు..’ అంటూ కార్యకర్తలు గట్టిగానే నినదించారు. కానీ, సాధారణ ప్రజానీకం అవాక్కవుతున్నారు చంద్రబాబు వ్యాఖ్యలతో. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో వున్న చంద్రబాబు ఇలా మాట్లాడటమేంటన్నది చాలామంది ప్రశ్న.
‘గుడ్ బై బాబు..’ అంటూ వైసీపీ వైపు నుంచి సెటైర్లు పడుతున్నాయి చంద్రబాబు మీద. మరోపక్క, ‘చివరి ఎన్నిక’ అని చంద్రబాబు అనడంతో టీడీపీ శ్రేణులూ ఆందోళన చెందుతున్నాయి. అసలేమయ్యింది చంద్రబాబుకి.? ఇలా ఆయన నైరాశ్యం ఎందుకు ప్రదర్శించినట్లు.? ఏమో, ఆయనకే తెలియాలి.