TDP Leaders Shocked By Pawan Kalyan Comments : అప్పుడే మంట పెట్టిన పవన్.. చంద్రబాబు సీఎం అభ్యర్థి కాదంట..!

NQ Staff - September 17, 2023 / 11:48 AM IST

TDP Leaders Shocked By Pawan Kalyan Comments : అప్పుడే మంట పెట్టిన పవన్.. చంద్రబాబు సీఎం అభ్యర్థి కాదంట..!

TDP Leaders Shocked By Pawan Kalyan Comments :

పవన్ కల్యాణ్‌ పిలవగానే వచ్చి పొత్తులు పెట్టేసుకున్నాడు. మనకు జనసేన పార్టీ కూడా బాగానే ఉపయోగపడుతుంది కదా అని టీడీపీ నేతలు అంచనాలు వేసుకున్నారు. కానీ ఆదిలోనే దెబ్బ కొట్టేలా ఉన్నాడు పవన్ కల్యాణ్‌. ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు పవన్ ను చాలా తక్కువ అంచనా వేశాడు. తాను చెప్పింది పవన్ వింటాడని.. తాను ఏది చెబితే అదే ఫాలో అవుతాడని చంద్రబాబు అనుకున్నారు. కానీ పవన్ కల్యాణ్‌ కూడా అదును చూసి దెబ్బ కొడుతున్నాడు. ఇందుకు నిన్న జనసేన నేతలతో మంగళగిరిలో జరిగిన విస్త్రృత స్థాయి సమావేశంలో పవన్ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.

ఆయన నిన్న మాట్లాడుతూ.. మనం ప్రధాని మోడీ అండతో బీజేపీ, టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లబోతున్నాం. కానీ పొత్తులో భాగంగా అధికారంలో మన వాటా, రాజు ఎవరు, మంత్రి ఎవరు అనేది వైసీపీని ఓడించిన తర్వాతే తేల్చుకుందాం. మన ఎన్డీయేలోనే ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మనం ఎన్డీయేను కాదని బయటకు వెళ్లబోం. బీజేపీతో మైత్రీ కొనసాగుతుంది అంటూ పవన్ కల్యాణ్‌ తేల్చి చెప్పేశారు. దాంతో ఇప్పుడు టీడీపీలో పెద్ద దుమారమే రేగుతోంది. పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యల వెనక పెద్ద ప్లానే ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే పవన్ తాను సీఎం కావాలని తెగ ఆశ పడుతున్నాడు.

ఇప్పుడు చంద్రబాబు బయటకు రాకపోతే కచ్చితంగా తీనే సీఎం అభ్యర్థి అని ఫిక్స్ అయిపోతున్నాడు. కానీ టీడీపీ, ఎల్లో మీడియా చంద్రబాబును తప్ప ఇంకెవరినీ సీఎం అభ్యర్థిగా ఒప్పుకోదు. అందుకే ఇప్పుడు టీడీపీలో ఆందోళన మొదలైంది. ముందు జనసేన-టీడీపీ గెలిచిన తర్వాతనే సీఎం అభ్యర్థిని డిసైడ్ చేయాలని.. ఎన్నికలకు ముందు డిసైడ్ చేసేది లేదంటూ పవన్ చెబుతున్నారు. అంటే ఎన్నికలకు ముందు సీఎం ఎవరో చెప్పేది లేదన్నమాట. పవన్ తీరును చూస్తుంటే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు కూడా భారీగానే డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. తమకు కాకుండా జనసేనకు టికెట్లు ఇస్తే ఊరుకోబోమని వార్నింగ్ లు ఇస్తున్నారు. దాంతో ఇప్పుడే టీడీపీలో పవన్ మంట పెడుతున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు టీడీపీకి పవన్ తో ప్రమాదమే అంటున్నారు. పవన్ కల్యాణ్‌ ఎక్కువ సీట్లను తీసుకుంటే అది టీడీపీ పార్టీని చీల్చే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని అంటున్నారు.

ఎందుకంటే జనసేనకు బలమైన నియోజకవర్గ స్థాయి నేతలు లేరు. కాబట్టి ఇప్పుడు పవన్ కు ఎక్కువ సీట్లు ఇస్తే టీడీపీలో రెబల్ గా ఉన్న వారందరినీ తన పార్టీలోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. దాని వల్ల టీడీపీకి పెద్ద నష్టం తప్పేలా లేదు. చూస్తుంటే ముందు ముందు పవన్ ఇంకెన్ని ఫిట్టింగులు పెడుతాడో అని భయపడిపోతున్నారు టీడీపీ నేతలు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us