YS Jagan Mohan Reddy : ఎంజీఆర్, ఎన్టీయార్.. ఆ తర్వాత వైఎస్ జగన్.!

NQ Staff - November 23, 2022 / 04:03 PM IST

YS Jagan Mohan Reddy : ఎంజీఆర్, ఎన్టీయార్.. ఆ తర్వాత వైఎస్ జగన్.!

YS Jagan Mohan Reddy : పార్టీ పెట్టి అధికారంలోకి వస్తే.. ఎంజీఆర్, ఎన్టీయార్, వైఎస్ జగన్ అంటారట.! అదే పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచి, పార్టీనీ ముఖ్యమంత్రి పదవినీ లాక్కుంటే వైఎస్ జగన్ అంటారట. రావణుడికి మద్దతిస్తే రాక్షసులంటారట.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా, చంద్రబాబుపై పై విధంగా విమర్శలతో చెలరేగిపోయారు. ప్రతి బహిరంగ సభలోనూ విపక్షాల్ని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్న వైఎస్ జగన్, ఈ క్రమంలో ‘స్క్రిప్టు చదవడంలో’ మాత్రం కొంత తడబడుతూనే వున్నారు.

వైఎస్సార్ సంగతేంటట.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా పిలుచుకుంటోంది వైఎస్ జగన్ అండ్ కో.! అసలంటూ ఆ పార్టీ ఎవరిది.? శివకుమార్ అనే వ్యక్తి నుంచి కదా, పార్టీ పేరుని లాక్కున్నది. ఆ శివకుమార్ అనే వ్యక్తి ఇప్పుడెక్కడున్నారట.?

వైసీపీ గౌరవాధ్యక్షరాలు వైఎస్ విజయమ్మ, వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి గతంలో సుదీర్ఘ పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల.. వీళ్ళంతా ఇప్పుడెక్కడ.? అని సోషల్ మీడియా వేదికగా టీడీపీ నిలదీస్తోంది.

మొత్తమ్మీద, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను చేసే ప్రతి విమర్శకీ, అంతే స్థాయిలో కౌంటర్ ఎటాక్‌ని కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ‘ఓ ఎంజీఆర్, ఓ ఎన్టీయార్.. ఓ జగన్..’ అంటూ సొంత డబ్బా కొట్టుకుంటున్న జగన్, చివరికి తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుని పక్కన పడేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us