Sabbam Hari : కరోనాతో టీడీపీ నేత సబ్బం హరి కన్నుమూత

Sabbam Hari : కరోనా కాటుకు మరో నేత బలయ్యారు. ఏపీ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన గత కొన్ని రోజులుగా కరోనా చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు.

tdp leader sabbam hari passes away
tdp leader sabbam hari passes away

విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కరోనా పాజిటివ్ రాగా.. కొన్ని రోజులు ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స  తీసుకుంటున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యం విషమించడంతో సబ్బం హరి మృతి చెందారు. ఆయనకు కరోనాతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉండటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని… డాక్టర్లు వెల్లడించారు.

సబ్బం హరి… వైజాగ్ మేయర్ గా పనిచేయడంతో పాటు… ఎంపీగానూ పనిచేశారు. అప్పట్లో వైఎస్సార్ ఫ్యామిలీతో సబ్బం హరి సన్నిహితంగా మెలిగేవారు. జగన్ తోనూ సబ్బం హరి సన్నిహితంగా మెలిగినా..కొన్ని కారణాల వల్ల ఇద్దరూ బద్ధశత్రువులయ్యారు.

Advertisement