ఆ తల్లి ఏడుస్తుంటే కూడా జగన్ గుండె కరగట్లేదా?

tdp leader pattabhi mother worried about her son
tdp leader pattabhi mother worried about her son

ఏపీలో ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్న ఘటన ఇదే. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై జరిగిన దాడి. ఆయనపై జరిగిన దాడికి చాలామంది మండిపడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలైతే అధికార పార్టీపై ఉవ్వెత్తున లేస్తున్నారు. ఆయనపై దాడి జరిగిందని తెలియగానే.. వెంటనే ఆయన ఇంటికి వెళ్లి టీడీపీ నేతలు పరామర్శిస్తున్నారు. ఆయన తల్లిని ఓదార్చుతున్నారు.

అయితే.. పట్టాభి తల్లి మాత్రం తన కొడుకుపై జరిగిన దాడికి చాలా బాధపడుతూ… భయం భయంగా ఉన్నారు. గత వారం రోజుల నుంచి భయపడుతున్నామని… తనపై దాడి చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని.. తన కొడుకు చెప్పాడని ఆమె ఈసందర్భంగా గుర్తు చేశారు.

నేను నా కొడుకు చెప్పినప్పుడు పెద్దగా భయపడలేదు. కానీ.. నా కొడుకును జాగ్రత్తగా ఉండాలని.. టీడీపీ నేత బోడె ప్రసాద్ కూడా చెప్పారు. సెక్యూరిటీ పెంచుకోమన్నారు. ఇవాళ ఉదయం.. నా కొడుకు బయటికి వెళ్లగానే నేను తలుపులు వేసుకున్నా. నేను తలుపులు వేసుకున్న కొద్ది సేపటికే బయటి నుంచి అరుపులు వినిపించాయి. కారు డ్రైవర్ కూడా కేకలు వేసుకుంటూ పరిగెత్తాడు. కారు ఇంట్లోకి వచ్చాక.. నా కొడుకు కనీసం కారులో నుంచి కూడా దిగలేకపోయాడు. నాకొడుకుకు తీవ్రంగా గాయాలయ్యాయి.. అంటూ పట్టాభి తల్లి బోరున విలపించారు.

Advertisement