బ్రేకింగ్ : టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్

టీడీపీ సీనియర్ నాయకుడు ధూళిపళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనది గుంటూరు జిల్లా చింతలపూడి. ఏమాత్రం సమాచారం లేకుండా… సుమారు 100 మంది పోలీసులను మోహరించిన ఏసీబీ అధికారులు ఇవాళ ఉదయం ఆయన్ను అరెస్ట్ చేశారు.

tdp leader dhulipalla narendra arrested by acb
tdp leader dhulipalla narendra arrested by acb

ధూళిపాళ్ల సంగం డెయిరీ చైర్మన్ గా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. అయితే.. ఆ సంస్థలో అక్రమాలు జరిగాయని ధూళిపాళ్లపై ఆరోఫణలు ఉన్నాయి. దీంతో విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు… పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసి నరేంద్రను అరెస్ట్ చేశారు.

ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా నరేంద్రను అలా ఉన్నఫళంగా అరెస్ట్ చేయడం ఏంటి? అంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ధూళిపాళ్లపై ఏసీబీ 408, 409, 418, 420, 465, 471, 120బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.

నరేంద్రను అరెస్ట్ చేసి బాపట్లకు తరలించారు. అక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి వైద్య పరీక్షలకు ఏసీబీ తరలించనుంది. ధూళిపాళ్ల భార్యకు కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది.

Advertisement