Ayyanna Patrudu: అన్నన్నా.. అయ్యన్నా.. జగన్ ని తిట్టేముందు ఇది చదివావా?

Ayyanna Patrudu: ఏపీ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇవాళ శుక్రవారం చాలా ఆవేశపడిపోయాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడాడు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ కనీ వినీ ఎరగని రీతిలో ఏపీలోని పనికి మాలిన జగన్ రెడ్డి ప్రజాధనం దోపిడీకి పాల్పడుతున్నాడని విమర్శించాడు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ రెచ్చిపోయాడు. అధికార పార్టీ వైఎస్సార్సీపీని ‘అలీబాబా 40 దొంగల ముఠా’తో పోల్చాడు. ఈ ముఠా దెబ్బకి రాష్ట్రం ఏవిధంగా భ్రష్టుపట్టిపోతోందో అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. పోలవరం, పట్టిసీమ, రివర్స్ టెండరింగ్, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం.. ఇలా పలు అంశాల్ని ప్రస్తావించాడు.

ఎన్టీఆర్ ఏం చేశాడో?..

గతంలో చంద్రబాబు అత్యద్భుతంగా పాలన చేశాడని, దేశంలో ఎక్కడికి వెళ్లినా ఆంధ్రప్రదేశ్ పేరు వింటే చాలు ‘మీది బాబు గారి రాష్ట్రమా’ అని అడిగేవారంటూ అయ్యన్నపాత్రుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. చంద్రబాబు రాకముందు ఏపీ అంటే ఇండియాలో ఎవడికీ తెలియదన్నట్లు బిల్డప్ ఇచ్చాడు. ఎన్టీఆర్ తెలుగోడి సత్తాని ప్రపంచానికి చాటాడని మళ్లీ వాళ్లే చెప్పుకుంటారు. ఈ రెండింటిలో ఏది నిజమో తెలుగు‘దేశానికే’ తెలియాలి. ఇక ఈ వేస్ట్ వ్యవహారాలన్నీ ఎందుకు గానీ అసలు విషయానికొద్దాం. సోమవారం చోటుచేసుకున్న సంఘటన ఇది. చింతకాయల అయ్యన్నపాత్రుడి అసలు స్వరూపం ఏంటో తెలిపే సంగతి. నిజమైన దోపిడీదారుడెవరో దీన్నిబట్టి అర్థంచేసుకోవచ్చు.

మంత్రిగా ఉండి లంచావతారం..

కాకి అనిత అనే ఓ అమ్మాయిది నిరుపేద కుటుంబం. తండ్రి తాగుడికి బానిస. తల్లికి పెద్దగా లోకజ్ఞానం తెలియదు. పైగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఐదుగురు ఆడపిల్లల్లో అనిత చిన్నది. ఇలాంటి పరిస్థితుల నుంచి ఎంతో కష్టపడి తైక్వాండోలో నేషనల్ ప్లేయర్ గా ఎదిగింది. ఎన్నో మెడల్స్ వచ్చాయి. ఎంతో మంది సన్మానాలు చేశారు. గతంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్)లో కోచ్ గా ఛాన్స్ వచ్చింది. కానీ అప్పట్లో టీడీపీ అధికారంలో ఉండగా ఈ మహానుభావుడు (అయ్యన్నపాత్రుడు) మంత్రిగా ఉండేవాడు. రూ.50 వేలు ఇస్తేనే అనితకి ఆ జాబ్ ఇస్తానని మధ్యవర్తుల ద్వారా బేరం పెట్టాడు. అంత ఇచ్చుకోలేక ఆ అమ్మాయి బంగారం లాంటి ఆ కొలువుని వదులుకుంది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఆయన ప్రవేశపెట్టిన విద్యా దీవెన సహా పలు పథకాలు ఆమె జీవితంలో మళ్లీ ఆశలను చిగురింపజేశాయి. అనిత ఇప్పుడు ఆంధ్రా వర్సిటీలో ఎంబీఏ చదువుతోంది. మొన్నే విద్యా దీవెన డబ్బులు వచ్చాయి. పూరింట్లో ఉంటున్న ఆమె ఫ్యామిలీకి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంటి స్థలం కూడా ఇచ్చింది. ఈ విషయాలన్నింటినీ కాకి అనితే స్వయంగా సోమవారం విద్యాదీవెనపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ కి చెప్పింది. దీంతో ఆమె పూర్తి వివరాలను తన ఆఫీసుకి పంపించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇదీ.. టీడీపీ అయ్యన్నపాత్రుడి అవినీతి పాత్ర. ఆయన జగన్ ని తిట్టడం అంటే దొంగే దొంగా దొంగా అని అరిచినట్లుంది.

Advertisement