రాష్ట్రంలో జగన్ చేస్తున్న విధ్వంసాన్ని ప్రజలు గుర్తించాలి: చంద్రబాబు

Advertisement

అమరావతి: అభివృద్ధి పేరుతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ విధ్వంసం సృష్టిస్తున్నారని, మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయిడు వెల్లడించారు. తన హయాంలో జరిగిందే అభివృద్దని, జగన్ చేస్తుంది మాత్రం అభివృద్ధి కాదని పేర్కొన్నారు. తమ హయాంలో అన్ని జిల్లాల అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగామని, నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని, ఈసీ ఆఫ్ డూయింగ్ బిసినెస్ రాష్ట్రాన్ని దేశంలోనే ముందు స్థానంలోకి తెచ్చామని, విశాఖను ఆర్థిక రాజధానిగా ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు గతంలో రచించామని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ప్రెస్ మీట్ లో వెల్లడించారు.

కరోనా విషయంలో కుడి వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ప్రజల మరణానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండిపడ్డారు. తమ హయాంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల్లో రాష్ట్రానికి ఏమి చేసిందో చెప్పాలని సవాల్ విసిరారు. బాబు సవాల్ పై వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here