TBJP : పవన్ ను కరివేపాకులా తీసి పారేస్తున్న బీజేపీ.. పరువు పాయే..!

NQ Staff - January 30, 2024 / 06:47 PM IST

TBJP : పవన్ ను కరివేపాకులా తీసి పారేస్తున్న బీజేపీ.. పరువు పాయే..!

TBJP :

పవన్ కల్యాణ్‌ తనకు తానే పెద్ద రాజకీయ తత్వ వేత్త అనుకుంటున్నారు గానీ.. వాస్తవంగా ఆయనకు ఇతర పార్టీలు ఇస్తున్న విలువ మాత్రం శూన్యమే. ఇప్పుడు మరోసారి ఇలాంటి అవమానమే పవన్ కు జరిగింది. పవన్ ను ఎవరు పిలిచినా సరే ఆయన వెళ్లిపోతారు. ఏ పార్టీతో పడితే ఆ పార్టీతో పొత్తులు పెట్టుకుంటారు. అంతే గానీ ఆయన పార్టీకి సొంతంగా పోటీ చేసేంత సీన్ లేదు. ఇక పవన్ రాజకీయ జీవితం చూస్తే మాత్రం చిత్ర విచిత్రంగా సాగుతోంది. ఏడాదికో పార్టీని మార్చేస్తున్నారు. ఇంత వరకు ఒక్క ఎమ్మెల్యే కూడా దిక్కులేని పార్టీని పెట్టుకుని ఆయన ఏం సాధిస్తారో ఎవరికీ అర్థం కావట్లేదు.

మొదట్లో సీపీఎం పార్టీతో పొత్తులు పెట్టుకున్న పవన్ కల్యాణ్‌.. ఆ తర్వాత ఎన్నికలు అయిపోగానే సీపీఎం సిద్దాంతాకు పూర్తి విరుద్ధంగా ఉండే బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి ఏపీ ఎన్నికలు దగ్గరకు రావడంతో చివరకు టీడీపీ రాగం ఎత్తుకున్నారు. చంద్రబాబు పిలవగానే ఎగేసుకుంటూ వెళ్లిపోయి ఆ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు. చంద్రబాబుకు సంపూర్ణ మద్దతు ప్రకటించి తనను తాను తగ్గించుకున్నాడు. అయితే పొత్తులు పెట్టుకుని రెండు నెలలు కూడా కాకముందే పవన్ ను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

పొత్తు ధర్మాలు పాటించకుండా ప్రకటనలు చేసుకుంటూ పోతున్నాడు. ఈ అవమానాలు భరించలేక పవన్ రగిలిపోతున్నాడు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు పవన్ కల్యాణ్‌ కు మరో షాక్ తగిలింది. ఎలాగైనా తమ కూటమిలోకి బీజేపీని కూడా లాక్కోవాలని పవన్ నానా పాట్లు పడుతున్నాడు. అయితే బీజేపీ మాత్రం పవన్ కల్యాణ్‌ తో పొత్తు విషయంలో ఏపీలో ఒక విధంగా తెలంగాణలో మరో విధంగా ఉంటుంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయానికి పవన్ ను పిలిచి ఎనిమిది సీట్లు పడేసింది. అదే మహాభాగ్యం అనుకుని పవన్ కల్యాణ్‌ మురిసిపోయాడు.

అయితే ఇప్పుడు ఎంపీ ఎన్నికల విషయంలో పవన్ కల్యాణ్‌ను కూరలో కరివేపాకులా తీసి పడేసింది తెలంగాణ బీజేపీ. ఎంపీ ఎన్నికలకు సొంతంగానే వెళ్తున్నట్టు ప్రకటించింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఎనిమిది చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. దాంతో పవన్ కల్యాణ్‌ బలం ఏంటో బీజేపీకి బాగా అర్థం అయింది.

ఆయనకు సీట్లు కేటాయించి అంతకన్నా తప్పు చేయడం ఇంకోటి ఉండదని బీజేపీ భావించింది. అందుకే ఈ ఎంపీ ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేస్తున్నట్టు తెలిపింది ఆ పార్టీ. దాంతో పవన్ కల్యాణ్‌ పరువు మొత్తం గంగలో కలిసిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు వైసీపీ నేతలు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us