Tarakaratna : నందమూరి తారకరత్న ఉవాచ: టీడీపీనే మాది.!
NQ Staff - December 19, 2022 / 03:44 PM IST

Tarakaratna : తెలుగుదేశం పార్టీ తరఫున పలు ఎన్నికల్లో ప్రచారం చేస్తూ వచ్చాడు సినీ నటుడు తారకరత్న. అయితే, వచ్చే ఎన్నికల్లో నందమూరి తారక రామారావు పోటీ చేయబోతున్నాడు. అంటే, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నాడన్నమాట. టీడీపీకి ఓటెయ్యండి.. అని ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన తారకరత్న, ఇకపై తనను కూడా గెలిపించండని 2024 ఎన్నికల్లో ఓటర్లను అభ్యర్థించనున్నాడన్నమాట.
ఇంతకీ తారకరత్న పోటీ చేయబోయేది అసెంబ్లీకా.? లోక్సభకా.? ఆ విషయమై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఎన్నికల్లో పోటీ చేస్తానని మాత్రం చెప్పాడు.
తారకరత్న చేపట్టబోయే పదవి ఏంటి.?
తెలుగుదేశం పార్టీలోనే వున్నారు నందమూరి బాలకృష్ణ. హిందూపురం ఎమ్మల్యేగా బాలకృష్ణ రెండు దఫాలుగా టీడీపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు తప్ప, పార్టీలో కీలక బాధ్యతలేవీ నిర్వహించడం లేదు.
మరి, తారకరత్నకి ఎలాంటి పదవిని చంద్రబాబు ఇస్తారు.? ఇదే ప్రశ్న తారకరత్న ముందుకొస్తే, ‘పార్టీనే మాదండీ.. ఇంకా పదవులు ఏంటి.?’ అంటూ నందమూరి తారకరత్న వ్యాఖ్యానించాడు. అంటే, పార్టీ పదవులేవీ నందమూరి వారసులకు వుండబోవన్నమాట.
పార్టీ కోసం కేవలం ఎమ్మెల్యేగానో, ఎంపీగానో పోటీచేసే అవకాశం ఇస్తారు. మహా అయితే రాజ్యసభ లేదా శాసన మండలి పదవులు. తారకరత్న విషయంలోనూ అదే జరగబోతోందేమో.!