Tarakaratna : తారకరత్న ఆరోగ్యం విషయమై పుకార్లు.. టీడీపీ రాజకీయం ఏముంది?
NQ Staff - January 28, 2023 / 10:30 PM IST

Tarakaratna : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర మొదటి రోజే తారకరత్న అస్వస్థతకు గురి అవ్వడంతో వైకాపా నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే మంత్రి రోజా మాట్లాడుతూ నారా లోకేష్ ది ఐరన్ లెగ్ అని అందుకే పాపం తారకరత్న హార్ట్ ఎటాక్ కి గురయ్యాడు అంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు.
మరి కొందరు వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు ఆఫ్ ది రికార్డ్ తారకరత్న ఆరోగ్యంపై అనూహ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తారకరత్న యొక్క ఆరోగ్యం విషయాన్ని రాజకీయం చేస్తూ వారి నాయకుడు లోకేష్ కి మంచి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వైకాపా కార్యకర్తలు విమర్శలు కురిపిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ మాత్రం తారకరత్న హార్ట్ ఎటాక్ విషయంలో రాజకీయం చేయాల్సిన అవసరం తమకు లేదు అన్నట్లుగా స్పందిస్తున్నారు. ఒక మనిషి యొక్క చావు బతుకులను కూడా రాజకీయం చేయడం కరెక్ట్ కాదు అనేది ఇరు పార్టీల నాయకులు గుర్తించాల్సిన అవసరం ఉంది.
రాజకీయం అనేది హుందాగా ఉండాలి కానీ ఎవరికి పడితే వారికి ఇబ్బంది కలిగిస్తూ జనాల్లో నమ్మకం కోల్పోయే విధంగా ఉండకూడదు అంటూ సాధారణ జనాలు మాట్లాడుకుంటున్నారు.
ఈ సమయంలోనే తారకరత్న ఆరోగ్యంతో తిరిగి రావాలని అంతా కోరుకుంటున్నారు. వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు తారకరత్న ఆరోగ్యం విషయంలో పుకార్లను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.