Taraka Ratna : హెల్త్ బులిటెన్ : ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్యం
NQ Staff - January 30, 2023 / 08:05 PM IST

Taraka Ratna : సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు బెంగళూరుకు చెందిన నారాయణ హృదయాలయ ఆసుపత్రి అధికారికంగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు.
ఆయనకు వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నామని హెల్త్ బులిటన్ లో నారాయణ హృదయాలయ యాజమాన్యం అధికారికంగా పేర్కొంది.
ఈనెల 27 తారీఖున కుప్పంలో లోకేష్ తో పాదయాత్రలో పాల్గొని కొద్దిగా దూరం నడిచిన తర్వాత గుండె పోటుతో కుప్ప కూలిన విషయం తెలిసిందే. వెంటనే కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు.
అక్కడి నుండి బెంగళూరుకి తారకరత్న ని తరలించి ప్రముఖ వైద్య బృందంతో చికిత్స అందిస్తున్నారు. తారకరత్న పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని నందమూరి అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రార్ధనలు చేస్తున్నారు. బాలకృష్ణ తో పాటు పలువురు కుటుంబ సభ్యులు బెంగళూరులోనే ఉండి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు.