TAAPSEE : క్రికెట‌ర్ కోసం చెమ‌ట చిందిస్తున్న తాప్సీ.. ఆమె క‌ష్టాన్ని చూసి అంతా షాక్

TAAPSEE : సినీ ఇండస్ట్రీలో బయోపిక్ లకు ఎలాంటి కొదువ లేదు. హీరోహీరోయిన్లు సైతం బయోపిక్స్ చేయడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాల గురించి అయితే అస్సలు చెప్పక్కర్లేదు. ఇప్పటికే క్రికెట్ లో సంచలనం సృష్టించిన ఎమ్. ఎస్. ధోని బయోపిక్ రికార్డ్స్ సృష్టించింది. ఇక ఇప్పుడు లేడీ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ తెరపైకి రాబోతున్న విషయం తెలిసిందే. మిథాలీ పాత్రకోసం తాప్సీ సెలెక్ట్ అయిన విషయం కూడా తెలిసిందే. ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే తో పాటు హీరోయిన్ తాప్సీ, రియల్ క్రికెటర్ గా.. ముఖ్యంగా మిథాలీ రాజ్ సాధించిన ఘనతను తెరపైన ప్రజంట్ చేయాలనే ఉద్దేశ్యంతో కష్టపడుతున్నారు.

ఆమె ఈ సినిమాను ఒక ప్రాజెక్ట్ గా మాత్రమే కాకుండా తన భాద్యతగా స్వీకరించారు. ఎంతోమంది ఆడపిల్లలకు.. కలల ఆశయాలకు నిలువెత్తు రూపంగా ఎదిగిన మిథాలీ సక్సెస్ స్టోరీని ప్రతి ఒక్కరికి కళ్ళకు కట్టినట్లు చూపించాలనే ఉద్ధేశ్యంతోనే ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికోసం తాప్సీ శభాష్ మిథు కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. ప్రస్తుతం ఆమె క్రికెట్ ప్రాక్టీస్ కోసం మోస్ట్ ఆఫ్ ది టైమ్ గ్రౌండ్ లోనే ఉన్నట్లు తెలుస్తుంది. వీటికి సంబంధించిన ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మిథాలీ రాజ్ గెటప్ లో తాప్సీ చాలా స్మార్ట్ గా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో తాప్సీ షేర్ చేసిన ఫోటోలకు తన అభిమానులతో పాటు నెటిజన్ల ద్వారా కూడా మంచి స్పందన వస్తుంది.

క్రికెటర్ గెటప్ లో తాప్సీ ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. క్రికెట్ నేర్చుకోవడానికి ఆమె ఓ స్పెషల్ కోచ్ ని పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ పాత్ర కోసం బాడీ లాంగ్వేజ్, క్రికెట్ ఆడే స్టైల్, ప్రాక్టీస్ ఇలా ప్రతీ విషయంలోనూ ఎంతో శ్రద్ద వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభిస్తుంది. ఈ సినిమాని ప్రముఖ డైరెక్టర్ రాహుల్ తెరకెక్కిస్తున్నారు.

Advertisement