Tapsee Pannu : ఆ తెలుగు హీరో రాత్రికి రమ్మన్నాడు.. హీరోయిన్ తాప్సీ సెన్సేషనల్..!
NQ Staff - June 21, 2023 / 01:19 PM IST

Tapsee Pannu : ఈ నడుమ తెలుగు హీరోలపై దారుణంగా ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు దర్శకులు, నిర్మాతలపై మాత్రమే ఆరోపణలు వినిపించేవి. కానీ ఈ నడుమ మాత్రం హీరోలపైనే ఎక్కువగా ఆరోపణలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఇలియానా కూడా తెలుగు హీరోలపై దారుణంగా ఆరోపణలు చేసింది.
ఇప్పుడు హీరోయిన్ తాప్సి కూడా సంచలన కామెంట్లు చేసింది. ఆమె ఒకప్పుడు తెలుగు హీరోలతో బాగానే సినిమాలు చేసింది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అప్పటి నుంచే అక్కడ వరుసగా సినిమాలు చేస్తోంది. కంగనా రనౌత్ తర్వాత ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది ఈ భామ.
అయితే తాజాగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాప్సి కాస్టింగ్ కౌచ్ మీద స్పందించింది. కాస్టింగ్ కౌచ్ అనేది అన్ని ఇండస్ట్రీలలో ఉంది. కాకపోతే బాలీవుడ్ లో ఇంకాస్త ఎక్కువగా ఉంది. తెలుగు హీరోలు కాస్టింగ్ కౌచ్ కు దూరంగా ఉంటారనే పేరుంది. కానీ అక్కడ కూడా నేను ఇబ్బంది పడ్డాను.
ఓ హీరో తన సినిమాలో ఛాన్స్ ఇవ్వాలంటే రాత్రికి రావాలంటూ నీచంగా మాట్లాడాడు. దాంతో ఆ సినిమా నుంచే తప్పుకున్నాను. అప్పటి నుంచి ఆ హీరోకు దూరంగా ఉన్నాను. కానీ తెలుగులో హీరోలు దాదాపు అందరూ మంచివారే. అందుకే ఎక్కువ కాలం అక్కడ సినిమాలు చేశాను అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ.