భార్యతో ప్రియుడు సాన్నిహిత్యం.. ప్రాణం తీసిన వైనం..

Samsthi 2210 - August 17, 2021 / 03:10 PM IST

భార్యతో ప్రియుడు సాన్నిహిత్యం.. ప్రాణం తీసిన వైనం..

ఈ మధ్యకాలంలో మానవీయ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. నానాటికి పెరుగుతున్న అఘాయిత్యాలు, వివాహేతర సంబంధాలు, పసిపిల్లలు, టీనేజ్ పిల్లలు, వివాహ సంబందాలు ఇలా ప్రతి ఒక్క స్టేజ్ లో ఏదోక అమానుషం, అన్యాయం పెరిగిపోతుంది. వీటన్నింటికి కారణాలు ఏంటి అనే సందేహం ప్రతిఒక్కరిలో తలెత్తుతుంది. సమాజం పట్ల సరైన స్పృహ లేకపోవడం.

జీవితంపై సరైన అవగాహన లేకపోవడం. సమాజంలో తోటివారితో ఏవిధంగా ప్రవర్తించాలో తెలియకపోవడం లాంటివి ఎక్కువవుతున్నాయి. దీంతో ఎవరు ఎవర్ని బలి తీసుకుంటున్నారనేది కూడా తెలియడం లేదు. అందుకే ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువయి.. కట్టుకున్నవారిని నిర్ధాక్ష్యంగా కడతేరుస్తున్నారు. అలాంటి ఓ సంఘటన ఆంబూరు సమీపంలో బాలూరు గ్రామంలో చోటు చేసుకుంది.

ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తమిళనాడులోని బాలురు గ్రామానికి చెందిన గోవిందస్వామి అనే వ్యక్తి అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన ఢిల్లీబాబు, అతని భార్య లక్ష్మీ, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు కుమారుడు, మరొకరు కుమార్తె ఉన్నారు. ఢిల్లీబాబు దోబీ దుకాణం నడుపుతున్నాడు. జీవితం ఆనందంగా సాగుతున్న క్రమంలో అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలో పనిచేసే గోవిందస్వామికి, ఢిల్లీబాబు భార్య లక్ష్మీకి వివాహేతర సంబంధం ఏర్పడింది.

మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఢిల్లీబాబు తన ఇంటి నుండి పనిమీద బయటకు వెళ్ళాడు. ఇదే అదునుగా చూసుకుని గోవిందస్వామి, లక్ష్మీ ఇంటికి వెళ్ళాడు. ఢిల్లీ బాబు తిరిగి తన ఇంటికి వచ్చి చూడగా గోవిందస్వామి, లక్ష్మీ గదిలో చనువుగా ఉన్నారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఢిల్లీబాబు కత్తితో గోవిందస్వామిపై దాడి చేశాడు. దాడిలో అతను అక్కడికక్కడే చనిపోయాడు.

విషయం తెలుసుకున్న‌ ఆంబూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. పోలీసులు నిందితుడు ఢిల్లీబాబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఏది ఏమైనా రోజురోజుకు ఇలాంటి చర్యలు ఎక్కువవుతున్నాయి. క్షణాకావేశంలో తీసుకునే నిర్ణయాలకు నిండు జీవితాలు బలవుతున్నాయి. అంతేకాకుండా పిల్లలు అనాధలుగా మారి రోడ్డున పడుతున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us