తమిళనాడుకు రెండు రాజధానులు ఏర్పాటు చెయ్యాలి

Advertisement

ఒకే రాష్ట్రానికి ఒకటి కంటే ఎక్కువ రాజధానులు ఉండాలనే అంశం ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో కూడా మొదలైంది. ఆంధ్రప్రదేశ్ పక్కన ఉన్న తమిళనాడులో కూడా తాజాగా రెండు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీకి చెందిన మంత్రి ఉదయ్ కుమార్ ఈ కొత్త ప్రతిపాదనకు పురుడుపోశాడు. మంత్రి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ…చెన్నైలో నిత్యం వరదలు వర్షాలు వస్తున్నాయి. ఎండాకాలంలో కరువు కాటకాలు తీవ్రమవుతున్నాయి. కాబట్టి తమిళనాడుకు వెంటనే మధురైని రెండో రాజధానిగా ప్రకటించారు. దీంతో ప్రజలకు ఇబ్బంది లేకుండా పాలన ఉంటుందని తెలిపారు. దీనికి పలువురు నేతలు కూడా మద్దతు తెలిపారు.

మంత్రి వ్యాఖ్యలను సమర్థిస్తూ తమిళనాడులో చాలామంది మధురైని రెండో రాజధానిగా నియమించాలని సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ విషయంపై అధికార పార్టీలోని నేతలు, ప్రతిపక్షాలలోని నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here