Radha: ఒక ‘రాధ’.. నలుగురు కృష్ణులు..

Radha: తమిళ చిత్రసీమలో రాధ అని ఒక హీరోయిన్ ఉంది. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. ఆమె ‘సుందరం ట్రావెల్స్’ అనే ఒక సినిమాలో కథానాయికగా చేసింది. అందులో హీరో మురళి. సీనియర్ యాక్టర్లు సత్యరాజ్, కార్తీక్ ల సరసన కూడా రాధ నటించింది. చూడటానికి బాగానే ఉంటుంది. కానీ ఆమె క్యారెక్టర్ పైనే అనుమానాలు కలుగుతున్నాయి. నాకు కాదు. రాధని పెళ్లిచేసుకున్నోళ్లకి. అందువల్ల ఆమె తరచూ వార్తల్లో నిలుస్తోంది. నిన్న గురువారం చెన్నైలోని ఓ పోలీస్ స్టేషన్ లో పోలీస్ పైనే కంప్లైంట్ చేసింది. అతను ఒక ఎస్ఐ. పేరు వసంత్ రాజ్. 38 ఏళ్ల వయసు ఉన్న రాధకి గతంలో పెళ్లయింది. కానీ భర్తతో విడాకులు తీసుకుంది. తల్లి, కొడుకుతో కలిసి ఉంటోంది.

షూటింగ్.. లుకింగ్..

ఒక సినిమా షూటింగులో ఎస్ఐ వసంత్ రాజ్ తో రాధకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఒక వ్యక్తిని పెళ్లి చేసుకునే ముందు అతని పూర్వపరాలేంటో తెలుసుకోవాలిగా. అదేం చేయలేదు. అయితే వసంత్ రాజ్ కి గతంలోనే పెళ్లయిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు రాధకి తెలుసని కొన్ని మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. మొత్తానికి వాళ్లిద్దరూ పెళ్లి చేసుకొని కాపురం పెట్టారు. కానీ కొన్నాళ్లకు వసంత్ రాజ్ కి రాధ మీద అనుమానం మొదలైంది. దీంతో ‘‘చిత్ర’’హింసలు పెట్టసాగాడు.

ఏంటా డౌటు?..

రాధ తన ఆధార్ కార్డులో భర్త పేరు, తన కొడుక్కి తండ్రి పేరు కూడా వసంత్ రాజ్ అనే మార్పించింది. ఈ విషయం అతనికి తెలియకుండానే చేసేసింది. ఇది కరెక్ట్ కాదు కదా. ఇది అంటే అతనికి చెప్పకుండా పేర్లు మార్పించటం కాదు. తన కొడుక్కి తండ్రిగా వసంత్ రాజ్ అని చెప్పుకోవటం. వసంత్ రాజ్ తో కనీసం పరిచయం కూడా కాకముందే రాధకి ఆ అబ్బాయి పుట్టాడు. బహుశా విడాకులు తీసుకున్న భర్తే ఆ పిలగాడికి తండ్రి అయి ఉంటాడు. కాబట్టి వసంత్ రాజ్ ని అతనికి తండ్రి అని చెప్పటం సరికాదు. ఈ విషయం తెలిసి వసంత్ రాజ్ రాధని గట్టిగా నిలదీశాడు. ఆమెతో జాగ్రత్తగా, దూరంగా ఉండాలని ప్రయత్నించాడు. కానీ రాధ వదిలిపెట్టలేదు. వసంత్ రాజ్ ని బుక్ చేసింది. అతనిపై ప్రస్తుతం పోలీస్ విచారణ జరుగుతోంది. అఫ్ కోర్స్ ఈ ఎపిసోడ్ లో వసంత్ రాజ్ తప్పు కూడా ఉందనుకోండి. అది వేరే విషయం.

మరో ట్విస్ట్..

రాధ వసంత్ రాజ్ పైన మాత్రమే కాదు. మరో ఇద్దరి పైన కూడా ఇలాగే పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టినట్లు దర్యాప్తులో తేలింది. ఆ ఇద్దరిలో ఒకరు బిజినెస్ మ్యాన్ అని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే రాధ ఇప్పటివరకు నలుగురు మగాళ్ల జీవితాలతో ఆడుకున్నట్లు అర్థమవుతోంది. సినిమా భాషలో చెప్పాలంటే ‘ఒక రాధ-నలుగురు కృష్ణులు’. రాధ లైఫ్ ఒక మూవీ స్టోరీలాగ భలే మలుపులు తిరుగుతోంది.

Advertisement