బ్రేకింగ్ : ప్రముఖ హాస్యనటుడికి గుండెపోటు.. ఆసుపత్రికి తరలింపు.. పరిస్థితి విషమం?

Actor Vivek : ప్రముఖ తమిళ నటుడు వివేక్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వివేక్… తమిళ నటుడు అయినా ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తమిళ సినిమాలు అన్నీ తెలుగులో డబ్ అవడం వల్ల.. ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.

tamil actor vivek hospitalized with cardiac arrest
tamil actor vivek hospitalized with cardiac arrest

ఆయన నటించిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ పక్కన ఎన్నో సినిమాల్లో వివేక్ నటించారు. అలాగే అజిత్, విజయ్, విశాల్ తో పాటు పలువురు తమిళ స్టార్ హీరోల సినిమాల్లో వివేక్ కామెడీ పాత్రల్లో నటించారు. తమిళంలో టాప్ కమెడియన్ అంటే వివేక్ పేరే చెబుతారు.

ఇప్పటికే వివేక్ తల్లి, కొడుకు ప్రసన్న కుమార్ మరణించడంతో ఆయన బాగా కుంగిపోయారు. అప్పటి నుంచి ఎక్కువగా సినిమాల్లోనూ నటించడం లేదు. ఆ బాధతోనే ఆయనకు గుండె  పోటు వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికైతే పరిస్థితి విషమంగానే ఉందని… ఇంకా కొంత సమయం గడిస్తే కానీ ఏం చెప్పలేమని డాక్టర్లు వెల్లడించారు.

Advertisement