హీరో విజయ్ అరుదైన రికార్డ్
Admin - October 8, 2020 / 07:13 AM IST

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది సినీ పరిశ్రమకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఇక సినిమా షూటింగ్ లు లేకపోవడంతో హీరోలు, దర్శకులు అని తేడా లేకుండా చిన్న టెక్నిషియన్ వరకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక అలా మూతపడ్డ షూటింగ్ లు మొదలయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా సినిమా థియేటర్లు కూడా తెరుచుకున్నాయి. కానీ కరోనా భయంతో సినిమా థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా.. లేదా.. అని సినిమా రిలీస్ చేయడానికి నిర్మాతలు ముందుకు రావడం లేదు.
ఇక దింట్లో భాగంగా తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్
సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసినప్పటికీ ఈ సినిమాను రిలీస్ చేయడనికి ముందుకు రావడం లేదు ఆ చిత్ర బృందం. ఇక మాస్టర్ సినిమాను ఈ ఏడాది రిలీస్ చేయమని స్పష్టం చేసారు. దీనితో విజయ్ పేరు మీద ఉన్న ఒక రికార్డ్ బ్రేక్ అయింది. విజయ్ తన సినీ కేరీర్ ప్రారంభించినప్పటి నుండి
ఏడాదికి రెండు సినిమాలు, లేదా ఒక సినిమా అయిన రిలీస్ చేస్తున్నాడు. విజయ్ తన 27 ఏళ్ల కెరీర్ లో ఇప్పటివరకు హీరోగా 64 సినిమాల్లో నటించాడు. గత 27 ఏళ్లలో విజయ్ ఒక్క ఏడాదిని కూడా జీరో ఇయర్ గా విడిచి పెట్టలేదు. ఇక స్టార్ హీరోల విషయంలో ఇది అరుదైన రికార్డు. ఇక మొత్తానికి విజయ్ కి కరోనా కారణంగా ఈ ఏడాది ఆ రికార్డుకు బ్రేక్ పడింది.