కరోనాతో ప్రఖ్యాత నటుడు మృతి

Advertisement

కరోనా ఎవ్వరిని వదలడం లేదు. సినీ, రాజకీయ నాయకులూ అని తేడా లేకుండా అందరు కరోనా బారిన పడుతున్నారు. ఇక దింట్లో చాలా వరకు కోలుకొని మాములు స్థితికి రాగా, ఒకరిద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇది ఇలా ఉంటె తాజాగా కరోనా మహామ్మారి దాటికి మరో నటుడు బలయ్యాడు. అయితే తమిళం, మలయాళంలో తన నటనతో ఆకట్టుకున్న ఫ్లోరెంట్ పెరిరా(67) అనే నటుడు కరోనా కారణంగా నిన్న ప్రాణాలు వదిలాడు.

పెరిరా తమిళంలో ప్రముఖ కారెక్టర్ ఆర్టిస్ట్‌గా పనిచేసాడు. అలాగే రాజా మంతిరి, ధర్మదురై, తోడరి, ముప్పారిమనమ్,సత్రియాన్ వంటి చిత్రాల్లో ఆయన నటనతో తమిళ ప్రేక్షకుల గుండెల్లో స్తానం దక్కించుకున్నాడు. అంతేకాదు ఈయన కలైంగర్ టీవీ ఛానెల్‌కు కొన్నాళ్లు జనరల్ మేనేజర్‌గా సేవలు అందించాడు. తాజాగా భారతీయ జనతా పార్టీలో చేరి కాశాయ కండువా కప్పుకున్నారు. ఇక ఈయన మరణానికి తమిళనాడుకు చెందిన సినీనటులుతో పాటు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here