Tamannaah Bhatia Shocking Comments On Bold Scenes : డబుల్ రెమ్యునరేషన్ ఇచ్చారు.. అందుకే లిప్ లాక్ సీన్లకు ఒప్పుకున్నాః తమన్నా

NQ Staff - July 9, 2023 / 09:34 AM IST

Tamannaah Bhatia Shocking Comments On Bold Scenes : డబుల్ రెమ్యునరేషన్ ఇచ్చారు.. అందుకే లిప్ లాక్ సీన్లకు ఒప్పుకున్నాః తమన్నా

Tamannaah Bhatia Shocking Comments On Bold Scenes :

తమన్నా ఇప్పుడు వరుసగా హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయిది. మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసిన ఈ హాట్ బ్యూటీ.. ఇప్పుడు ఇక్కడ ఛాన్సులు తగ్గడంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా వెబ్ సిరీస్ లు, సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది.

ఇక అక్కడకు వెళ్లిన తర్వాత ఎంతగా మారిపోయిందో చూస్తున్నాం. మొన్న వచ్చిన లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో ఏకంగా లిప్ లాక్ సీన్లతో రెచ్చిపోయింది. తమన్నా ఎంటైర్ కెరీర్ లో ఇప్పటి వరకు లిప్ లాక్, బెడ్ సీన్లు చేయలేదు. కానీ ఇందులో తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి ఓ రేంజ్ లోరెచ్చిపోయి రొమాన్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఆ పని చేస్తే తప్పేంటి..

దాంతో ఆమె ఫ్యాన్స్ చాలా హర్ట్ అయిపోయారు. అయితే ఈ బోల్డ్ సీన్లు చేయడంపై ఆమె షాకింగ్ కామెంట్లు చేస్తోంది. ఇలాంటి సీన్లు చేస్తే తప్పేంటి.. ఎందుకు ఇలా ట్రోల్స్ చేస్తున్నారు అంటూ మొన్న ప్రశ్నించింది. ఇక తాజాగా ఇలా ఎందుకు చేశానో తెలిపింది. ఈ సిరీస్ లో తన పాత్రకు డబుల్ రెమ్యునరేషన్ ఇచ్చారు.

పైగా తన మనసుకు నచ్చిన వ్యక్తి కావడంతో లిప్ లాక్ సీన్లకు ఒప్పుకున్నట్టు వివరించింది ఈ బ్యూటీ. ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అంటే డబ్బులు ఎక్కువ ఇస్తే ఏ సీన్ అయినా చేస్తావా అంటూ కడిగేస్తున్నారు కొందరు నెటిజన్లు. తమన్నా బాగా కమర్షియల్ అయిపోయిందని అంటున్నారు మరికొందరు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us