Tamannaah Bhatia : బూతులు మాట్లాడితే తప్పా.. తమన్నా నువ్వేనా ఇలా అంటున్నది..!
NQ Staff - June 20, 2023 / 01:23 PM IST

Tamannaah Bhatia : తమన్నా చాలా మారిపోయింది. మన సౌత్ లో మొన్నటి వరకు అగ్ర హీరోయిన్ గా ఉన్నప్పుడు చాలా పద్ధతిగా కనిపించింది. కానీ ఇప్పుడు బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత చాలా దారుణమైన పాత్రల్లో నటిస్తోంది. పూర్తిగా బోల్డ్ పాత్రల్లోనే మెరుస్తోంది. రీసెంట్ గా ఆమె నటించిన జీ కర్దా వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే ఇందులో తమన్నా దారుణమైన బూతులు మాట్లాడే అమ్మాయిగా కనిపించింది. అంతే కాకుండా బెడ్ రూమ్ సీన్లలో బట్టలు విప్పేసి మరీ నటించింది. దాంతో ఆమెపై దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఇలాంటి సీన్లలో ఎలా నటించావు అంటూ ఆమెపై సోషల్ మీడియాలో ట్రోల్స్, నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు.
కాగా వీటిపై తాజాగా తమన్నా ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. సినిమాకు కచ్చితంగా అవసరం అయితే తప్ప మేం ఏమీ కావాలని చేయం. ఇప్పుడు జనరేషన్ చాలా వేగంగా మారిపోతోంది. అడల్ట్, బూతులు మాట్లాడే సినిమాలకు, వెబ్ సిరీస్ లకు బాగా డిమాండ్ పెరిగిపోతోంది.

Tamannaah Bhatia Responded Trolls Negative Comments On Social Media
అలా అని ఏది పడితే అది పెట్టేసి సినిమా తీసేయలేం. కేవలం ఆ కథకు అవసరం అనుకుంటేనే ఆ సీన్లను పెట్టేస్తాం. ఇప్పుడు జీ కర్దాలో కూడా అదే జరిగింది. అందులో కొన్ని బూతులు ఉన్న మాట నిజమే. అలా అని మాట్లాడితే తప్పు అని చెప్పలేం. కేవలం ఆ సీన్ కు తగ్గట్టు మాత్రమే పెట్టుకుంటాం అంటూ తెలిపింది తమన్నా.