Tamannaah Bhatia : అవును.. అతనితో డేటింగ్ చేస్తున్నా.. ఫైనల్ గా చెప్పేసిన తమన్నా..!
NQ Staff - June 13, 2023 / 11:52 AM IST

Tamannaah Bhatia : సిని సెలబ్రిటీలు పెండ్లికి ముందే డేటింగ్ చేయడం అనేది చాలా కామన్ అయిపోయింది. కొందరు డేటింగ్ చేసిన తర్వాత పెండ్లి చేసుకుంటున్నారు. మరికొందరు డేటింగ్ వరకే ఆపేస్తున్నారు. ఇప్పుడు తమన్నా కూడా ఈ డేటింగ్ కోవలోకి వచ్చేసింది. ఆమె ఇప్పుడు నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆయ గతంలో నాని నటించిన ఎంసీఏ సినిమాలో విలన్ గా నటించాడు. కాగా విజయ్ వర్మ, తమన్నా కలిసి లస్ట్ స్టోరీస్-2లో నటిస్తున్నారు. ఆ సమయంలోనే ఇద్దరి నడుమ ప్రేమ చిగురించింది. ఇద్దరూ కలిసి పార్టీలు, రెస్టారెంట్లు తిరుగుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని బటయ పెట్టలేదు.
కానీ తాజాగా తమన్నా తన ప్రేమ విషయాన్ని బటయ పెట్టింది. అవును విజయ్ వర్మతో నాకున్న రిలేషన్ నిజమే. లస్ట్ స్టోరీస్ 2 సెట్స్ లో తమ ప్రేమ కథ మొదలైందని ఆమె చెప్పుకొచ్చారు. నేను గతంలో చాలామందితో పని చేశాను. కానీ విజయ్ నాకు చాలా స్పెషల్ పర్సన్. నా కోసం నేను స్పెషల్ వరల్డ్ సృష్టించుకున్నాను.
నా ప్రపంచంలోకి విజయ్ వచ్చాడు. అతను నన్ను ఆపదల నుంచి రక్షిస్తాడు. అతను ఎక్కడ ఉంటే అదే నాకు ఇష్టమైన ప్రదేశం అంటూ తెలిపాడు విజయ్ వర్మ. ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి విజయ్ ను ఆమె పెండ్లి చేసుకుంటుందా లేకపోతే మధ్యలోనే బ్రేకప్ చెబుతుందా అనేది మాత్రం చూడాలి.