Tamannaah Bhatia : బాహుబలి విషయంలో రాజమౌళి అన్యాయం చేశాడు.. తమన్నా సంచలన కామెంట్లు..!

NQ Staff - June 15, 2023 / 01:49 PM IST

Tamannaah Bhatia : బాహుబలి విషయంలో రాజమౌళి అన్యాయం చేశాడు.. తమన్నా సంచలన కామెంట్లు..!

Tamannaah Bhatia : బాహుబలి.. ఇది సినిమా కాదు.. ఓ చరిత్ర. ఇలాంటి సినిమాలు మళ్లీ రావు. ఇందులో నటించిన వారి పేర్లు తరతరాలు గుర్తుండిపోతాయి. అంత గొప్ప సినిమా అయింది ఇది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రతి పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. అంతగా ఈ సినిమా ఆకట్టుకుంది.

ఈ సినిమాలో నటించడం మా అదృష్టం అని ఇందులో నటించిన వారు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. కానీ తమన్నా మాత్రం తనకు అన్యాయం జరగిందని అంటుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె సంచలన కామెంట్లు చేసింది. కమర్షియల్ సినిమాల్లో హీరోలకు మాత్రమే పేరు వస్తుంది.

బాహుబలి సినిమా వల్ల కేవలం ప్రభాస్, రానాలకు మాత్రమే పేరు వచ్చింది. ఈ సినిమాలో నాది కేవలం గెస్ట్ రోల్ అన్నట్టే చూపించారు. ఈ సినిమా కోసం ప్రభాస్, రానా కష్టపడ్డారు. కాబట్టి వారికి పేరు రావడంలో తప్పు లేదు. కానీ నేను కూడా కష్టపడ్డాను కదా.. కానీ నాకు మాత్రం పేరు రాలేదు.

Tamannaah Bhatia Character Are Not Famous In Baahubali Movie

Tamannaah Bhatia Character Are Not Famous In Baahubali Movie

ఒకవేళ రాజమౌళి గారు నాకు పేరు వచ్చేంతగా నా పాత్రను డిజైన్ చేయలేదేమో అనిపిస్తోంది. ఈ విషయంలో మాత్రం నాకు అన్యాయం జరిగిందని ఫీల్ అయ్యాను అంటూ ఎమోషనల్ అయింది తమన్నా. ఈ సినిమా వల్ల అనుష్క శెట్టికి వచ్చినంత పేరు తమన్నాకు రాలేదనే చెప్పుకోవాలి. ఆమె ఈ సినిమాలో గ్లామర్ వరకు మాత్రమే ప్లస్ అయింది. అంతకు మించి ఏ పేరు రాలేదు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us