Tamannaah Bhatia : తమన్నాకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన మాజీ లవర్.. మోజు తీరలేదా..!
NQ Staff - February 4, 2023 / 09:18 AM IST

Tamannaah Bhatia : తమన్నా ఇప్పుడు బాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉంటుంది. ఏ మాత్రం గ్యాప్ లేకుండా చాలా బిజీగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. కాగా ఆమెకు సంబంధించిన న్యూస్ ఈ నడుమ బాగా వైరల్ అవుతోంది.
ఎందుకంటే తమన్నా గత కొంత కాలంగా విజయ్ వర్మతో డేటింగ్‌చేస్తోంది. ఈ విజయ్ వర్మ ఎవరో కాదు నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ఎంసీఏ సినిమాలో విలన్ గా చేశాడు.
వీరిద్దరూ కలిసి ఇప్పుడు లవ్ స్టోరీస్-2 లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారినట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అప్పటి నుంచే ఇద్దరూ కలిసి విచ్చల విడిగా తిరుగుతున్నారు. అప్పటి నుంచే ఇద్దరి పేర్లు ట్రెండింగ్ లో ఉంటున్నాయి.
ఇక న్యూ ఇయర్ సందర్భంగా ఇద్దరూ కలిసి చేసిన లిప్ లాక్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసి పడేసింది. ఇదిలా ఉండగా త్వరలోనే ఈ జంట పెండ్లి చేసుకోబోతోందని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో తమన్నాకు తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ఇతనితో గతంలో తమన్నా లవ్ ఎఫైర్ నడిపిందనే టాక్ కూడా ఉంది.
అయితే తమన్నా పెండ్లికి ముందే మరోసారి ఆమెకు ఛాన్స్ ఇవ్వడంతో ఈ హీరోపై వార్తలు వైరల్ అవుతున్నాయి. తమన్నాపై ఆయనకు ఇంకా మోజు తీరలేదేమో అందుకే ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు అంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు.