Tamannah No Kiss Rule : ప్రియుడి కోసం 18 ఏళ్ల నో కిస్ రూల్ ను బ్రేక్ చేసిన తమన్నా.. విజయ్ స్పందన ఇదే..!

NQ Staff - June 24, 2023 / 10:50 AM IST

Tamannah No Kiss Rule : ప్రియుడి కోసం 18 ఏళ్ల నో కిస్ రూల్ ను బ్రేక్ చేసిన తమన్నా.. విజయ్ స్పందన ఇదే..!

Tamannah No Kiss Rule : తమన్నా అంటే సౌత్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో పాపులారిటీ ఉంది. ఇప్పటి వరకు తెలుగు, తమిళంలోని అందరు అగ్ర హీరోలతో ఆమె సినిమాలు చేసింది. కానీ ఏ ఒక్క హీరోతో కూడా ఇప్పటి వరకు లిప్ లాక్ చేయలేదు. అది ఆమె కండీషన్. 18 ఏళ్లుగా సినిమాల్లో ఇదే రూల్ ను పెట్టుకుని సినిమాలు చేస్తోంది మిల్కీ బ్యూటీ.

అయితే బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత ఆమెలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జీ కర్దాలో బెడ్ రూమ్ సీన్లలో బట్టల్లేకుండా నటించింది. కాగా లస్ట్ స్టోరీస్-2 కోసం ఆమె ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. ముఖ్యంగా ఇందులో తన ప్రియుడు విజయ్ వర్మ కోసం నో కిస్ రూల్ ను కూడా బ్రేక్ చేసింది.

ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తమన్నానే చెప్పింది. తన ప్రియుడి కోసం అని కాకుండా తన పాత్ర కోసం ఇలా చేశానని చెప్పింది ఈ భామ. అయితే అందరూ కేవలం తన ప్రియుడి కోసమే ఇలా చేసిందని అంటున్నారు. ఆమె వ్యాఖ్యలపై తాజాగా విజయ్ వర్మ కూడా స్పందించాడు. తమన్నా చేసిన రూల్ బ్రేక్ చాలా గొప్పది అంటూ పొగిడాడు.

Tamanna Bhatia Acted Glamor Role In Lust Stories 2 Movie

Tamanna Bhatia Acted Glamor Role In Lust Stories 2 Movie

లస్ట్ స్టోరీస్-2 లో కేవలం తమన్నా మాత్రమే కరెక్టుగా సరిపోతుందని చెప్పాడు విజయ్ వర్మ. నేను ఈ స్క్రిప్ట్ వినక ముందే ఇందులో హీరోయిన్ ఎవరు అని అడిగాను. తమన్నా అని చెప్పగా వెంటనే నేను గొప్ప నిర్ణయం అని చెప్పాను. ఆమె పాత్ర కోసం చాలా కష్టపడింది అంటూ తెలిపాడు విజయ్ వర్మ.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us