Biryani: హైద‌రాబాదీ బిర్యానీపై తాలిబ‌న్ల ప్ర‌భావం.. ధ‌ర‌లు భారీగా పెరిగే ఛాన్స్

Biryani: హైదరాబాదీ బిర్యానీ అంటే ఒక ఎమోషన్ లాంటిది. బిర్యానీ టేస్ట్ చేసిన తర్వాత ఎవ్వరైనా సరే మళ్ళీ మళ్ళీ తినాల్సిందే. దానికున్న స్పెషాలిటీ అదే. అందులోనూ తెలుగు ప్రాంతాల్లో ఉన్న బిర్యానీ ప్రియులకు బిర్యానీ అంటే మరింత క్రేజ్ ఉంటుంది. హైదరాబాద్ బిర్యానీ అంటే ఇంకాస్త ఇష్టం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రేజ్ ని అర్థం చేసుకున్న బిర్యానీ ప్రియుల కోసం ప్రస్తుతం హైదరాబాద్ బిర్యానీ తెలుగు రాష్ట్రాల్లో దర్శనమిస్తుంది. అల్టిమేట్ టేస్ట్ తో రీజనబుల్ ప్రైజ్ తో అందర్ని ఆకర్షిస్తోంది.

ముఖ్యంగా బిర్యానీలో వేసే డ్రైఫ్రూట్స్ తో మరింత రుచిని ఆకర్షిస్తుంది. కానీ ఒక్కసారిగా ఈ బిర్యానీ ధర అమాంతం పెరిగిపోతుందట. ఎందుకంటే బిర్యానీలో ఉపయోగించే డ్రైఫ్రూట్స్ ధరలు పెరిగాయి. దీనికి కారణం అఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు ఆక్రమించడంతో అక్కడ పండే డ్రైఫ్రూట్స్ పై ధరలు ఒక్కసారిగా పెంచేసారు. ముఖ్యంగా బాదం, ఎండుద్రాక్ష, అత్తిపండు, పిస్తాపప్పు, జీడిపప్పు ఎక్కువగా అప్ఘనిస్తాన్ నుండే దిగుమతి చేసుకుంటాం.

వీటితో పాటు కొన్ని మసాలా దినుసులు కూడా వస్తుంటాయి. ఇప్పుడు అక్కడ రాజ్యం అంతా తాలిబన్లే కనుక డ్రైఫ్రూట్స్ ధరలు పెరగడంతో వాటి ఎఫెక్ట్ బిర్యానీ మీద పడుతుంది. ఇక లేటెస్ట్ గా అఫ్ఘనిస్తాన్ లో కాందహార్, హెరాత్ సిటీల్లో ఉన్న ఇండియా దౌత్య కార్యాలయాల్లో తాలిబన్లు తనిఖీలు చేసారని భారత ప్రభుత్వాలు తెలిపాయి. అక్కడున్న కొన్ని వాహనాల్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఓ ప్రముఖ మీడియా ఛానెల్ కు ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. తాలిబన్ల ఈ చర్యలను ముందే ఊహించామని, కొన్ని డాక్యూమెంట్స్ కోసం వెతికారని, భారత దౌత్య కార్యాలయాల నుండి వాహనాలను తీసుకెళ్ళారని అన్నారు.

కాబుల్ లో రాయబార కార్యాలయంతో పాటు నాలుగు భారత దౌత్య కార్యాలయాలున్న సంగతి తెలిసిందే. స్థానికుల సహకారాలతో కాబుల్ లో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. మిగిలిన వాటిపై తాలిబన్లు సెర్చ్ చేశారా లేదా అనేది ఇంకా తెలియాలి.