Afghanistan: మొద‌లైన తాలిబ‌న్ల వికృత చేష్ట‌లు.. ఇక‌పై ప‌శు వ్య‌భిచారం

Afghanistan: ఎలాంటి ప్ర‌తిఘ‌ట‌న లేకుండా ఆఫ్ఘ‌నిస్తాన్‌ని ఆక్ర‌మించుకున్న తాలిబ‌న్స్ ఇప్పుడు అక్క‌డ వికృత చేష్ట‌లు చేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. మహిళల హక్కులు, స్వేచ్ఛను కాలరాస్తున్నారు. ఇటీవ‌ల పైల‌ట్ నీలోఫర్ రెహమాన్ వారి చ‌ర్య‌ల‌పై ఆవేదన వ్యక్తంచేసింది. మహిళల పట్ల వివక్ష చూపబోమన్న తాలిబన్ల మాటలను నమ్మొద్దంటూ ఆఫ్గన్ మహిళలను హెచ్చరిస్తోంది.


Talibans Replace animals Afghan Prostitution Houses
Talibans Replace animals Afghan Prostitution Houses

తాలిబన్లు చిత్రహింసలు పెట్టి చంపుతారని భయాందోళన వ్యక్తం చేసింది. తాను పైలట్ కావడానికి సహకరించిన కుటుంబ సభ్యులు ఇప్పుడు ప్రమాదంలో పడ్డారంటూ కన్నీళ్లు పెట్టుకుంటోంది. వారిని తాలిబన్లు బ్రతకనీయరంటూ బోరున విలపించింది. మొత్తం 400 జిల్లాల్లోని 100 జిల్లాలను వశపరచుకున్నట్టు తాలిబన్లు ప్రకటించారు. ఆయా జిల్లాల్లో తమ నిబంధనలు, తాలిబన్ ఉగ్ర చట్టాలను అమలు చేస్తున్నారు.

మహిళలు భర్త లేకుండా ఒంటరిగా బయటకు వెళ్లొద్దని, మగవాళ్లు కచ్చితంగా గడ్డం పెంచాలని, గడ్డం తీయకూడదని తఖర్ ప్రావిన్స్ లో దిక్తత్ లు పాస్ చేశారు. అంతేగాకుండా అమ్మాయికి పెళ్లి చేస్తే వరుడి కుటుంబానికి కచ్చితంగా కట్నం ఇవ్వాల్సిందేనన్న నిబంధననూ పెట్టారని అక్కడి పౌర హక్కుల సంస్థలు చెబుతున్నాయి. ఒకవేళ ఎవరైనా నియమాలను కట్టుదప్పితే ఎలాంటి ఆధారాలు లేకున్నా శిక్షలు వేస్తున్నారని మిరాజుద్దీన్ షరీఫీ అనే పౌర హక్కుల కార్యకర్త చెప్పారు.

కొద్ది రోజులుగా అణచివేత ధోరణిని మొదలుపెట్టిన తాలిబ‌న్స్ తాజాగా కాబూల్‌లోని డజన్లకొద్దీ వేశ్య గృహాలను దగ్గరుండి మరీ ఖాళీ చేయించి ఆ స్థానంలో జంతువుల్ని ఉంచారు. దీంతో జంతు పరిరక్షణ సంఘాలు మండిపడుతున్నాయి. 1990 సమయంలో తమ పాలనలో వేశ్య వృత్తిని తాలిబన్లు అణిచివేసిన వారు లైంగిక వాంఛల్ని తీర్చుకోవడానికి జంతువుల్ని వేశ్య గృహాల్లో ఉంచేవాళ్లు. వాళ్ల దృష్టిలో వేశ్య వృత్తిలో మహిళలు కొనసాగడానికి వీల్లేదు. జంతువులతో శృంగారంలో పాల్గొనేందుకు మాత్రం తాలిబన్లు అనుమతి ఇస్తారు.

ఆఫ్ఘ‌న్‌లో అమెరికా సైన్యం మోహరింపు ఉన్న‌ప్పుడు వేశ్య వృత్తి బాగానే సాగింది. కాని ఇప్పుడు వీరి రాక‌తో ప‌రిస్థితులు పూర్తిగా మారాయి. తాలిబన్లు వేశ్య వృత్తిని.. ఇస్లాం వ్యతిరేక వ్యాపారాల్లో ఒకటిగా భావిస్తుంటారు. బదులుగా జంతువులతో పాల్గొని ఒత్తిడి తీర్చుకోవాలంటూ తమ గ్రూపులకు సలహా ఇస్తుంటారు కూడా. ‘‘వాళ్ల(తాలిబన్ల) దృష్టిలో ఆడవాళ్లంటే పిల్లలు కనే యంత్రాలు. చూస్తుంటే.. ఆడవాళ్ల కంటే మూగ జీవాలకే వాళ్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఉంది’’ అంటే ప‌లువురు కామెంట్స్ చేస్తున్నారు.