Talibans: మ‌నిషిని హెలికాఫ్ట‌ర్‌కి వేలాడ‌దీసి చ‌క్క‌ర్లు కొట్టిన‌ తాలిబ‌న్స్.. అస‌లు విష‌యం ఇది..!

Talibans: ఆఫ్ఘ‌నిస్తాన్ తాలిబ‌న్స్ వ‌శం అయ్యాక వారు వికృత చేష్ట‌ల‌తో అక్క‌డి ప్ర‌జ‌ల‌ను భ‌యబ్రాంతుల‌కి గురి చేస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు పూర్తిగా వెనుదిరిగాయి. దీంతో తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు జరుపుకున్నారు. అయితే తాలిబన్లు పైకి శాంతి మంత్రం జపిస్తున్నప్పటికీ లోలోప‌ల వారు చేస్తున్న వికృత చేష్ట‌లు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి.


Taliban militants fly US helicopter with man hanging from rope
Taliban militants fly US helicopter with man hanging from rope


ఎవ‌రైన త‌మ‌కు వ్య‌తిరేఖంగా ఉంటే వారిని తుద‌ముట్టించేస్తున్నారు. మహిళలపై పలు ఆంక్షలు విధిస్తున్నారు. అఫ్గాన్‌లో పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి. అమెరిక‌న్లు ఆఫ్ఘ‌న్‌ని ఖాళీ చేసిన కొద్ది గంట‌ల‌కు వారు కాబూల్ ఎయిర్ పోర్ట్‌లో సంబురాలు జ‌రుపుకున్నారు.గ‌న్స్ గాల్లోకి పేలుస్తూ వీరంగం సృష్టించారు. అలానే ఓ వ్యక్తిని తాడు సాయంతో హెలికాఫ్టర్‌ నుంచి వేలాడదీశారు. కాందాహార్‌‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా సమాచారం.


కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఆ వ్యక్తిని చంపిన తర్వాత అలా వేలాడదీశారని, తాలిబ‌న్స్ ప‌రాకాష్ట‌కు ఇది నిదర్శ‌మ‌ని వారు పేర్కొన్నారు. అయితే అస‌లు విష‌యం ఏంటేంటే కాందహార్ లోని గవర్నర్ కార్యాలయం మీద జెండా ఎగరేయడానికి ఆ తాలిబన్ మెంబర్ ప్రయత్నించాడు. ఫుల్ లెంగ్త్ వీడియోలో చేతులు ఊపడం కూడా చూడొచ్చు. అమెరికా భద్రత దళాల ఉపసంహరణ సందర్భంగా తాలిబన్ల సంబురంలో భాగంగా ఈ ఘటన జరిగింది. చ‌నిపోయిన వ్య‌క్తిని వేలాడ‌దీసార‌ని వ‌చ్చిన వార్త‌ల‌లో వాస్తవం లేదు.