Talasani Srinivas Yadav : ఆర్‌ఆర్‌ఆర్ కి ఆస్కార్… కేంద్రానికి కౌంటర్ ఇచ్చిన టీ మంత్రి
NQ Staff - March 13, 2023 / 08:11 PM IST

Talasani Srinivas Yadav : ఆర్‌ఆర్‌ఆర్ సినిమా నాటు నాటు పాటకు దక్కిన ఆస్కార్ అవార్డు గురించి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ వారు ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ను కనీసం ఒక్క కేటగిరీలో కూడా ఆస్కార్ కు నామినేట్ చేస్తూ ప్రకటించలేదు. దాంతో రాజమౌళి స్వయంగా ఆస్కార్ నామినేషన్స్ కు ప్రయత్నించిన విషయం తెల్సిందే.
తెలుగు సినిమా ను ఆస్కార్ కు నామినేట్ చేయక పోవడం పట్ల తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తప్పుబట్టారు. ఆయన ఆర్‌ఆర్‌ఆర్ కు ఆస్కార్ అవార్డు సొంతం అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా గుజరాతీ సినిమాను మాత్రమే ఆస్కార్ కు నామినేట్ చేయడంపై రాజకీయ విమర్శలు చేశారు.
దేశ వ్యాప్తంగా ఎంతో గొప్ప సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం గుజరాతీ సినిమాను మాత్రమే ఎందుకు ఆస్కార్ నామినేషన్స్ కు పంపిందో అంటూ చాలా మంది బీఆర్‌ఎస్ నాయకులు కూడా ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వంను ప్రశ్నిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోం శాఖ మంత్రి అమిత్ షా లు గుజరాత్ కు చెందిన వారు అవ్వడం వల్లే గుజరాతీ సినిమాకు ఆస్కార్ దక్కిందని ఎద్దేవ చేస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కామెంట్స్ చేశారు అనడంలో సందేహం లేదు.