Taapsee Pannu Satires About Ileana D’Cruz Pregnancy : ఆమె లాగా నేనింకా ప్రెగ్నెంట్ కాలేదు.. ఇలియానాపై తాప్సీ సెటైర్లు..!
NQ Staff - July 18, 2023 / 10:02 AM IST

Taapsee Pannu Satires About Ileana D’Cruz Pregnancy :
తాప్సీ హీరోయిన్ గా ఇప్పుడు ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. అయితే ఆమె హీరోయిన్ గా కంటే కూడా ఆమె కాంట్రవర్సీలతోనే ఎక్కువగా ఫేమస్ అయిపోయింది. అందుకే ఆమెను అందరూ ఫైర్ బ్రాండ్ అంటూ పిలుస్తున్నారు. ఇక కెరీర్ పరంగా చేస్తున్న సినిమాల కంటే కూడా ఎక్కువగా ఇలాంటి కాంట్రవర్సీ విషయాలతోనే ఫేమస్ అయిపోయింది.
ఇదిలా ఉండగా తాజాగా తాప్సీ నటిస్తున్న మూవీలు డంకీ, ఏలియన్. ఈ రెండు సినిమాలతో ఆమె బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఇందులో మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ఓ నెటిజన్ అడిగాడు. దానికి ఆమె షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.
పెళ్లికి ముందే అలా..
దాంతో ఈ రిప్లై కాస్త వైరల్ అవుతోంది. అయితే ఆమె ఇలియానాను ఉద్దేశించే ఇలాంటి కామెంట్లు చేసినట్టు అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే ఇప్పుడు ఇలియానా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది కదా. అంటే ఇలియానా లాగా తాను పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కాలేదని ఇలా కౌంటర్ వేసిందన్నమాట.
ఇలియానా ఇప్పుడు తొమ్మిదో నెల ప్రెగ్నెంట్. తాజాగా ఆమె తన ప్రెగ్నెన్సీకి కారణం అయిన వ్యక్తి ఫొటోను కూడా రివీల్ చేసింది. ఏదేమైనా తాప్సీ ఇలాంటి సెటైర్లు వేయడం ఇదేం కొత్త కాదు.