Taapsee Pannu : వారికి కమిట్ మెంట్లు ఇచ్చేవారికే ఛాన్సులిస్తారు.. తాప్సీ సంచలన కామెంట్లు..!
NQ Staff - June 18, 2023 / 02:23 PM IST

Taapsee Pannu : హీరోయిన్ తాప్సికి నేషనల్ వైడ్ గా పాపులారిటీ ఉంది. ఆమె అంతకు ముందు సౌత్ ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో నటించింది. కానీ ఎందుకో స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. సౌత్ లో కెరీర్ కొనసాగిస్తూనే అటు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ వరసగా సినిమాలు చేస్తూనే ఉంది ఈ భామ.
ఇక బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత ఆమె ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. బాలీవుడ్ లో జరిగే అనేక విషయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటుంది ఈ భామ. ఆమె కూడా కంగనా రనౌత్ లాగా బాలీవుడ్ హీరోలపై, కాస్టింగ్ కౌచ్ మీద నోరు విప్పుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ.. ఇందులో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్ లో అందరికీ అవకాశాలు ఇవ్వరు. ఒక సినిమాలో ఏ పాత్రకు ఎవరిని తీసుకోవాలో కొందరు నటులు మాత్రమే డిసైడ్ చేస్తారు. వారికి నచ్చిన విధంగా ప్రవర్తించే వారిని, వారికి కమిట్ మెంట్ ఇచ్చేవారికే ముందు ఛాన్సులు ఇస్తారు.
ఆ తర్వాత వారికి క్లోజ్ గా ఉండేవారికి, వారి స్నేహితులకు మాత్రమే అవకాశాలు ఇస్తుంటారు. అంతే తప్ప మిగతా వారిని అస్సలు పట్టించుకోరు. ఇప్పుడు బాలీవుడ్ లో జరుగుతోంది ఇదే. ఇక్కడ ట్యాలెంట్ తో పనిలేదు. వారికి నచ్చినట్టు ఉంటే సరిపోతుంది అంటూ చెప్పుకొచ్చింది తాప్సీ.