Taapsee Pannu Reacts On Casting Couch : ఫోన్ చేసి రాత్రికి రమ్మనేవారు.. హీరోయిన్ తాప్సీ సెన్సేషనల్..!

NQ Staff - August 12, 2023 / 02:52 PM IST

Taapsee Pannu Reacts On Casting Couch : ఫోన్ చేసి రాత్రికి రమ్మనేవారు.. హీరోయిన్ తాప్సీ సెన్సేషనల్..!

Taapsee Pannu Reacts On Casting Couch :

హాట్ బ్యూటీ తాప్సీ ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. ఆమె సినిమాల కంటే కూడా వ్యక్తిగత కామెట్స్ తోనే ఎక్కువగా ఫేమస్ అవుతూ ఉంటుంది. ఆమె అప్పుడప్పుడు బాలీవుడ్ మీద చేసే కామెంట్లు బాంబులా పేలుతుంటాయి. అందుకే ఆమెకు కూడా ఫైర్ బ్రాండ్ అనే పేరు వచ్చిందని చెప్పుకోవాలి.

ఆమె గతంలో టాలీవుడ్ లో కోలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ ఇక్కడ అగ్ర హీరోయిన్ల లిస్టులో లేకపోయింది. సెకండ్ హీరోయిన్ గాకూడా సినిమాలు చేసింది. తర్వాత బాలీవుడ్ వెళ్లిపోయింది. ఇప్పుడు అక్కడే వరుసగా సినిమాలు చేస్తోంది. అయితే తాజాగా తాప్సీ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

గెస్ట్ హౌస్ కు రమ్మనేవారు..

తాజా ఇంటర్వ్యూలో ఆమెకు కాస్టింగ్ కౌచ్ పై ప్రశ్న వచ్చింది. దానికి ఆమె స్పందిస్తూ.. సౌత్ లో కంటే బాలీవుడ్ లోనే కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంది. నేను బాలీవుడ్ కు వచ్చిన కొత్తలో చాలామంది ఫోన్లు చేసి అర్థరాత్రి వారి గెస్ట్ హౌస్ కు రమ్మనేవారు. నేను అలాంటి దాన్ని కాదని చెప్పినా సరే వినేవారు కాదు.

ఒక ఇద్దరు హీరోలు తమతో డేటింగ్ చేయాలని చాలా కాలం నన్ను వేధించారు. నీకు సినిమాల్లో ఛాన్సులు రాకుండా చూస్తామని బెదిరించారు. కానీ నేను వారిని సీరియస్ గా తీసుకోలేదు. కేవలం నన్ను నేను నమ్ముకుని ఇక్కడి వరకు వచ్చాను అంటూ తెలిపింది తాప్సీ.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us