T20 World Cup : టీ20 వరల్డ్ కప్: టీమిండియా ఖేల్ ఖతం.!

NQ Staff - November 10, 2022 / 04:39 PM IST

T20 World Cup : టీ20 వరల్డ్ కప్: టీమిండియా ఖేల్ ఖతం.!

T20 World Cup : టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో టీమిండియా చేతులెత్తేసింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా, బౌలింగ్‌లో అత్యంత పేలవమైన ఆటతీరు ప్రదర్శించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్.. పైగా, ఫైనల్‌కి తీసుకెళ్ళే మ్యాచ్.. అందునా, పాకిస్తాన్‌తో ఫైనల్‌లో తలపడే అవకాశం.. ఇన్ని ప్రత్యేకతలున్న మ్యాచ్‌ని టీమిండియా లైట్ తీసుకుంది.

తొలుత బ్యాటింగ్‌కి దిగిన టీమిండియా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. నిజానికి, ఇది చిన్న స్కోర్ ఏమీ కాదు. కెఎల్ రాహుల్ మరోమారు ఫెయిల్ అయ్యాడు. కోహ్లీ, హార్దిక్ పాండ్యా.. టీమిండియాకి గౌరవ ప్రదమైన స్కోర్ అందించారు.

టీమిండియా బౌలర్లు చేతులెత్తేయడంతో..

సరిగ్గా బౌలింగ్ చేయడం దండగ అని టీమిండియా బౌలర్లు అనుకున్నారో.. భారత బౌలర్లు ఎలా బంతులు సంధించినా, చితక్కొట్టేయాలని ఇంగ్లాండ్ ఓపెనర్లు ఫిక్స్ అయ్యారోగానీ.. 169 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది.

ఓపెనర్లు బట్లర్, హెల్స్.. మొత్తం స్కోర్‌ని సింపుల్‌గా ఊది పాడేశారనడం అతిశయోక్తి కాదేమో. హేల్స్ 7 సిక్సర్లు బాదితే, బట్లర్ 3 సిక్సర్లు బాదాడు. ఇద్దరూ కలిసి మొత్తంగా పదమూడు బౌండరీలు సాధించారు. జస్ట్ 16 ఓవర్లలో ఇంగ్లాండ్ విజయలక్ష్యాన్ని చేరుకుంది. అంటే, నాలుగు ఓవర్లు మిగిలి వుండగానే ఖేల్ ఖతం అయిపోయిందన్నమాట.

బౌలింగ్ పరంగా చూసుకుంటే, టీమిండియాకి ఇది అత్యంత చెత్త మ్యాచ్.!

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us