Cricket: టీ 20 క్రికెట్‌లో డ‌బుల్ సెంచ‌రీ సాధ్య‌మా.. సుసాధ్యం చేసి చూపించాడు..!

Cricket: స్టార్ట్ యుగంలో అన్ని ప‌రిస్థితులు ఎంత‌గా మారుతున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇక క్రికెట్‌లోను రాను రాను కొత్త మార్పులు వ‌స్తున్నాయి. ఒకప్పుడు టెస్ట్ క్రికెట్‌, వ‌న్డే మ్యాచ్‌ల‌లోనే మస్త మ‌జా పొందిన క్రికెట్ ప్రేమికులు టీ20ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. టీ20 క్రికెట్ అంటేనే.. ధనాధన్ ఫటాఫట్ గేమ్. బంతిని బౌండ‌రీల‌కు త‌ర‌లించే ప‌నిలోనే ఉంటారు బ్యాట్స్‌మెన్స్. టీ 20 కి మంచి ఆద‌ర‌ణ వ‌చ్చిన నేప‌థ్యంలో టీ10 కూడా వెలుగ‌లోకి వ‌చ్చింది.

అయితే టీ 20 క్రికెట్‌లో క్రికెట‌ర్స్ త‌క్కువ బంతుల్లో ఎక్కువ ప‌రుగులు చేస్తుండ‌డం మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. మ‌న దేశ క్రికెట‌ర్స్‌తో పాటు విదేశీ క్రికెట‌ర్స్ కూడా సెంచ‌రీల మోత మోగించారు. అయితే 200 మార్క్ అందుకోవ‌డం మాత్రం చాలా క‌ష్ట‌త‌రంగా మారింది. కాని దీనిని సుసాధ్యం చేసి చూపించాడు ఓ క్రికెట‌ర్.

కేవలం 120 బంతుల్లో ముగిసే ఇన్నింగ్స్ లో జట్టు స్కోరు 200 మార్కు దాటడం అనేదే చాలా సార్లు అసాధ్యంగా మారుతుంది. అలాంటిది.. ఓ బ్యాట్స్ మెన్ ఈ స్కోరు బాదేశాడు. ఆ విధంగా.. టీ20 ఫార్మాట్ చరిత్రలోనే తొలి డబుల్ సెంచరీ నమోదైంది. ఢిల్లీలో జరిగిరన ఓ క్లబ్ మ్యాచ్. ఢిల్లీ ఎలెవన్ సింబా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సుబోధ్ భాటియా అల‌వోక‌గా డ‌బుల్ సెంచ‌రీ బాదాడు.

ఢిల్లీ ఎలెవన్ జట్టుకు చెందిన సుబోధ్ అనే ఆటగాడు ఓపెనర్ గా వచ్చి డబుల్ సెంచరీతో అజేయంగా నిలిచాడు. కేవలం 79 బంతుల్లోనే 205 పరుగులు సాధించాడంటే. అత‌ని విధ్వంసం ఏ రేంజ్‌లో సాగిందో చెప్ప‌వ‌చ్చు. సుబోధ్ సుడిగాలి ఇన్నింగ్స్ లో 17 ఫోర్లు 17 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ రంజీ ఆటగాడు తొలి సెంచరీని కేవలం 17 బంతుల్లోనే సాధించడం విశేషం.

సుబోధ్ ఊచకోతతో ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 256 పరుగులు భారీ స్కోరు సాధించింది. అంత‌ర్జాతీయ ఆట‌గాడు కాక‌పోయిన అత‌ని ఆట తీరుపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తుంది.