T Congress : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అతడే సీఎం?

NQ Staff - December 2, 2023 / 10:34 AM IST

T Congress : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అతడే సీఎం?

T Congress :

పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. వచ్చిన ప్రతీ ఎగ్జిట్ పోల్ కాంగ్రెస్ దే అధికారమని తేల్చేశాయి. అయితే ‘ఎగ్జాట్ రిజల్ట్స్’ కోసం రేపటిదాక ఆగాల్సిందే. అయితే జనాల మూడ్ ఏంటో ఎంతో కొంత ఏజెన్సీ సంస్థల పసిగట్టాయనే చెప్పవచ్చు. దీంతో తమదే అధికారమని కాంగ్రెస్ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. మిగదంతా లాంఛనమే కాబట్టి కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థి ఎవరు? అని చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ అంటేనే వర్గాల కూటమి అని తెలిసిందే.

కాంగ్రెస్ లో ఇప్పటికే సీఎం పోరు మొదలైంది. అయితే సీఎంను నిర్ణయించేది మాత్రం సోనియా, రాహుల్, ప్రియాంకలే అనే విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో తొమ్మిది మంది ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారు. వారి బలబలాలేమిటో ఇప్పుడు చూద్దాం..

1. భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గం తప్ప ఎక్కడ ప్రచారం చేయలేదు. ఈయనకు ఎస్సీ కాబట్టి ఆమేరకు చాన్స్ ఉండే అవకాశం ఉంది.

2. ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గం తప్ప ఎక్కడ ప్రచారం చేయలేదు.

3. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ నియోజకవర్గం తప్ప ఎక్కడ ప్రచారం చేయలేదు.

4. దామోదర్ రాజనర్సింహ ఆందోల్ నియోజకవర్గం తప్ప ఎక్కడ ప్రచారం చేయలేదు.

5. జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గం తప్ప ఎక్కడ ప్రచారం చేయలేదు.

6. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం తప్ప ఎక్కడ ప్రచారం చేయలేదు.

7. దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గం తప్ప ఎక్కడ ప్రచారం చేయలేదు.

8. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు, ఖమ్మం జిల్లా తప్ప ఎక్కడ ప్రచారం చేయలేదు.

9. కుందూరు జానారెడ్డి రాష్ట్రంలో ఎక్కడ ప్రచారం చేయలేదు. వీరంతా ముఖ్యమంత్రి అభ్యర్థులే. వీరు ఎక్కడా ప్రచారం చేయకపోవడం, జనాలకు సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ కాకపోవడం వీరికి మైనస్.

T Congress Comes Power Will Discussion Who CM candidate

T Congress Comes Power Will Discussion Who CM candidate

అయితే టీపీసీసీ ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి పార్టీ ప్రచార బాధ్యతలను రేవంత్ రెడ్డి భుజస్కంధాలపై వేసుకున్నారు. వివిధ వర్గాలను ఏకతాటిపైకి తేవడం, నిరుద్యోగుల మద్దతు తీసుకోవడం.. లాంటి కీలక బాధ్యతలన్నీ ఆయనే తీసుకున్నారు. దాదాపు తెలంగాణలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల పక్షాన ప్రచారం చేశారు.

తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి పాటుపడ్డారు. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానంతో పాటు కాంగ్రెస్ క్యాడర్ కూడా రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తారుమారైతే మాత్రం.. హంగ్ లేదా బీఆర్ఎస్ అధికారం చేపట్టే అవకాశం వస్తే మాత్రం కాంగ్రెస్ రాజకీయం వేరేలా ఉంటుందని చెప్పవచ్చు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us