SYAMALA: అరెస్టైన రెండు రోజుల‌కు విడుద‌లైన శ్యామ‌ల భ‌ర్త‌.. వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చిన న‌ర‌సింహా

బుల్లితెర యాంక‌ర్,బిగ్ బాస్ ఫేం శ్యామ‌ల భ‌ర్త ల‌క్ష్మీ న‌ర‌సింహా రెడ్డిని చీటింగ్ కేసులో రాయ‌దుర్గం పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. న‌ర‌సింహాతో పాటు ఆయ‌న‌కు మీడియేట‌ర్‌గా ఉన్న మ‌హిళ‌ను కూడా అరెస్ట్ చేశారు. అయితే తాజాగా బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన న‌ర‌సింహా రెడ్డి, త‌న అరెస్ట్‌కు సంబంధించిన వీడియోను ఒక‌టి శ్యామ‌ల అకౌంట్‌లో షేర్ చేశాడు. ఇందులో త‌న వాద‌న వినిపిస్తూ, త‌న‌ని న‌మ్మిన వారంద‌రికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేశాడు.

ఇటీవ‌ల నాపై సోష‌ల్ మీడియాలో చాలా వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌ప్పుడు ఆరోప‌ణ‌లు నమ్మ‌కుండా అండ‌గా నిలిచిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు. ఈ కేసుకు సంబంధించిన వివ‌రాలు, ఎలా త‌ప్పుదోవ ప‌ట్టించారనే విష‌యాలు అన్నింటికి సంబంధించి త‌గిన ఆధారాల‌తో మీ ముందుకు వ‌స్తాను. రెండు రోజుల‌లో నేను బ‌య‌ట‌కు వ‌చ్చానంటే ఇది త‌ప్పుడు కేసు అని మీకు అర్ద‌మయ్యే ఉంటుంది. త‌గిన ఆధారాల‌తో మీ ముందుకు త్వ‌ర‌లోనే వ‌స్తాను. కొన్ని సార్లు నింద‌ల‌ను భ‌రించాలి, పుకార్ల‌కు స్పందించాలి అంటూ న‌ర‌సింహా రెడ్డి వీడియోలో పేర్కొన్నాడు.

Advertisement