Asha Kandra: ఒక‌ప్పుడు పారిశుద్ధ్య కార్మికురాలు.. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్‌

Asha Kandra జీవితంలో పోరాడితే  మ‌నం సాధించ‌లేనిదంటూ ఏమి ఉండ‌దు. క‌ష్టే ఫ‌లి అని పెద్ద‌లు చెప్పిన‌ట్టుగా క‌ష్ట ప‌డితే ఫ‌లితం త‌ప్ప‌క వ‌స్తుంది. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌లు కూడా చాలా ఉన్నాయి. రీసెంట్‌గా ఓ పారిశుద్ధ్య కార్మికురాలు డిప్యూటీ క‌లెక్ట‌ర్‌గా మారి అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. మే 40 ఏళ్ల ఆశా కుందారా.

తాను ఒంట‌రిగా ఉంటూ ఇద్ద‌రు పిల్ల‌ల పోష‌ణ కోసం వీధులు ఊడ్చింది. ఉన్నత విద్య ఆశ‌యాన్ని పెట్టుకున్న ఆశా కుందారా   పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తూనే ఉన్న‌త చ‌దువులు చ‌దివింది. తాజాగా రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందింది.ఎక్కడైతే వీధులు ఊడ్చిందో అక్క‌డే డిప్యూటీ కలెక్టరుగా బాధ్యతలు చేపట్టనుంది. ఈమె స్టోరీ విని ప్ర‌తి ఒక్క‌రు గ‌ర్వంగా ఫీల‌వుతున్నారు.

రాజస్థాన్‌లోని జోథ్‌పుర్‌కు చెందిన పేద కుటుంబంలో పుట్టిన ఆశా కుందారాకు బాగా ఉన్న‌త చ‌దువులు చ‌ద‌వాల‌ని కోరిక‌. చిన్న‌వ‌య‌స్సులో పెళ్లైంది. అత్తారింట్లో ఉండి చ‌దువుకోవాల‌నుకున్నా భ‌ర్త వైఖ‌రి వ‌ల‌న సాధ్యం కాలేదు. ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టాక అత్తారింట్లో వేధింపులు ఎక్కువ‌య్యాయి. దీంతో 2013లో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

త‌న మాదిరిగా త‌న పిల్ల‌లు ఉండ‌కూడ‌ద‌ని వారి  కోసం  జోథ్‌పుర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పారిశుద్ధ్య కార్మికురాలిగా చేరింది. ‘ఇంటి బాధ్యతలు, విధులు, చదువు వీటన్నింటిని సమన్వయం చేయడానికి చాలా క‌ష్ట‌ప‌డింది. ఉద‌యం నాలుగు గంట‌ల‌కు లేచి ప‌నులన్ని పూర్తి చేసుకొని ఐదు గంట‌కు విధుల‌కు వెళ్లేది. ఆ త‌ర్వాత చ‌దువుపై దృష్టి పెట్టేది. సందేహాల‌ని డిగ్రీ చ‌దువుత‌న్న పిల్ల‌ల‌ని అడిగి తెలుసుకునేది.

మా కార్యాలయంలో కలెక్టరు, మేయర్‌ వంటి వారిని చూసినప్పుడల్లా వారిలాగే గౌరవాన్ని పొందాలనిపించేది. దాన్ని సాధించాలని సంకల్పం పెట్టుకున్నా అని ఆశా కుందారా పేర్కొంది.  2018లో ఆర్‌పీఎస్‌సీ పరీక్షలు రాయ‌గా, కొవిడ్‌ వల్ల ఫలితాలు ఆలస్యమయ్యాయి. ఇటీవల విడుదలవ్వడం, తాను 728వ ర్యాంకును సాధించడం ఆమెకు పట్టలేని సంతోషాన్నిచ్చింది.

ఈ నెల మొదటి వారంలోనే పారిశుద్ధ్య కార్మికురాలిగా శాశ్వత నియామక ఆర్డరు వచ్చింది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందడంతో డిప్యూటీ కలెక్టరుగా బాధ్యతలను తీసుకోనున్నా. ప్రజా పాలనాధికారిగా అందరి సంక్షేమానికి పాటుపడతా. ఇక్కడే స్వీపర్‌గా పనిచేసిన నేను ఇదే చోట గౌరవాన్ని అందుకోవడం గర్వంగా ఉంది. ఇద్దరు పిల్లలతో ఎనిమిదేళ్ల క్రితం ఇంటినుంచి బయటికి వచ్చినప్పుడు మనసులో నా పిల్లలను ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని అనుకున్నా. వారిని బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దుతా’ అని అంటోంది ఆశా కుందారా.