SUSHMITHA:టాలీవుడ్‌పై క‌న్నేసిన మెగా డాట‌ర్.. యువ హీరోతో అదృష్టం ప‌రీక్షించుకునేందుకు రెడీ!

మెగా కాంపౌండ్ నుండి వ‌రుస బెట్టి హీరోలు వ‌స్తూనే ఉన్నారు. రీసెంట్‌గా సాయి ధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ ఉప్పెన సినిమాతో తెరంగేట్రం చేయ‌గా, ఈ సినిమా అత‌నికి మంచి విజ‌యాన్ని అందించింది. దీంతో మ‌రిన్ని సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు వైష్ణ‌వ్ తేజ్. అయితే మెగా ఫ్యామిలీ హీరోలంద‌రితో ఓ క్రికెట్ టీం త‌యారు చేయోచ్చ‌నే విమ‌ర్శ ఉన్న‌ప్ప‌టికీ, ఈ ఫ్యామిలీ నుండి కుర్రాళ్లు వ‌స్తూనే ఉన్నారు, త‌మ టాలెంట్ నిరూపించుకొని ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకుంటున్నారు. ఇక ఇప్పుడు మెగా డాట‌ర్ సుస్మిత టైం వ‌చ్చింది.

సుస్మిత ఇప్ప‌టికే కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ న‌టించిన సినిమాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా ప‌ని చేసిన సుస్మిత కొద్ది కాలం క్రితం తన‌ భర్త విష్ణుతో కలిసి ‘గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్’ స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్‌లో ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ పేరుతో ఓ వెబ్ సిరీస్‌ను కూడా నిర్మించారు. ఇది ప్రేక్ష‌కుల‌ని పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయింది. అయితే ఈ సారి సుస్మిత వెండితెర‌పై త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ద‌మైంది. ఓ త‌మిళ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను ఇప్ప‌టికే కొనుగోలు చేసిన ఆమె త్వ‌ర‌లో ఈ చిత్రాన్ని రూపొందించ‌నుంద‌ట‌.

8 తొట్ట‌క‌ల్ అనే త‌మిళ సస్సెన్ష్‌ థ్రిల్లర్ నాలుగు సంవ‌త్స‌రాల క్రితం విడుద‌ల కాగా, ఈ చిత్రం త‌మిళంలో మంచి విజ‌యం సాధించింది. క‌న్న‌డ‌లోను ఈ మూవీని రీమేక్ చేశాడు. అక్క‌డ భారీ విజ‌యం సాధించింది. అయితే ఈ మూవీ తెలుగు రీమేక్ హ‌క్కుల‌కు కొనుగోలు చేసినట్లు సమాచారం. తన సొంత బ్యానర్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సుస్మిత ఓ కీలక పాత్ర చేయనుందని వినికిడి. యువ హీరోతో ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, అతి త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది. కాగా కేసు విచార‌ణ‌లో పోలీసు త‌న రివాల్వ‌ర్ పోగొట్టుకోగా ఇది ఎన్నో ప‌రిణామాల‌కు దారి తీస్తుంది. ఇంట్రెస్టింగ్ లైన్‌తో చిత్రాన్నిరూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల‌ని అల‌రిస్తుంద‌ని విశ్వ‌సిస్తున్నారు.

Advertisement