Rishabh Pant : రిషబ్ పంత్ ని కాపాడిన బస్ డ్రైవర్ ఇతడే.. నీకు రుణపడి ఉంటాం

NQ Staff - December 31, 2022 / 11:23 AM IST

Rishabh Pant : రిషబ్ పంత్ ని కాపాడిన బస్ డ్రైవర్ ఇతడే.. నీకు రుణపడి ఉంటాం

Rishabh Pant : భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ శుక్రవారం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన విషయం తెలిసిందే. అతి వేగం ప్రమాదానికి కారణం అయి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పంత్ ప్రయాణిస్తున్న కారు పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది.

సకాలంలో పంత్ ని కారు నుండి బయటకు తీయక పోతే కారులోనే ఆయన సజీవ దహనం అయ్యేవారని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. కారు కాలిపోయిన పరిస్థితిని చూస్తే నిజంగానే పంత్‌ ని దేవుడు కాపాడినట్లు ఉంది అనిపిస్తుంది.

పంత్‌ యాక్సిడెంట్ అయ్యి కారు నుండి బయట పడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అటుగా వెళుతున్న బస్సు డ్రైవర్ చూసి రక్షించారట. సుశీల్ కుమార్ అనే బస్సు డ్రైవర్ పంత్ ని బయటకు తీయడంతో పాటు వెంటనే ఆంబులెన్స్ మరి పోలీసులకు సమాచారం అందించాడట.

సుశీల్ కుమార్ సమాచారంతోనే సకాలంలో పోలీసులు మరియు అంబులెన్స్ అక్కడికి చేరుకున్నాయి. అందుకే పంత్‌ అభిమానులతో పాటు ఇండియన్ మాజీ క్రికెటర్ లు చాలా మంది సుశీల్ కుమార్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

నీకు రుణపడి ఉంటాం అంటూ మాజీ క్రికెటర్ వివి ఎస్‌ లక్ష్మణ్‌ ట్వీట్ చేశాడు. రిషబ్ పంత్ ని కాపాడిన బస్సు డ్రైవర్ మరియు కండక్టర్లకు హర్యానా ప్రభుత్వం ప్రశంస పత్రాలను అందించడంతో పాటు రివార్డులను కూడా అందించినట్లు తెలుస్తోంది. ఇక పంత్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని.. అతి త్వరలోనే ఆయన పూర్తిగా కోరుకుంటాడని వైద్యులు మరియు కుటుంబ సభ్యులు తెలియజేశారు.

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us