ఆకట్టుకుంటున్న సుశాంత్ సింగ్ మైనపు విగ్రహం

Advertisement

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ జూన్ 14న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక తరువాత ఆయన మృతి పై పలు అనుమానాలు తలెత్తాయి. దీనితో సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇది ఇలా ఉంటె సుశాంత్ మైనపు విగ్రహాన్ని తుస్సాడ్ మ్యూజియంలో పెట్టాలని అభిమానులు కోరుతున్నారు. దీనితో పశ్చిమ బెంగాల్‌లోని ఆసాన్ సోల్‌కు చెందిన కళాకారుడు సుశాంతా రే నటుడు సుశాంత్ ‌కు వినూత్నరీతిలో నివాళులు తెలిపాడు.

అయితే ఆయన సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ మైనపు విగ్రహాన్ని తయారు చేయించారు. ఇక ఈ విగ్రహాన్ని సందర్శకులు కోసం ఓ మ్యూజియంలో నెలకొల్పారు. ఈ మైనపు విగ్రహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఒకవైపు ఈ విగ్రహాన్ని చూసిన సుశాంత్ అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here