సుశాంత్ ఆత్మహత్య కేసులో సారా, శ్రద్ధలకు ‘డ్రగ్’ నోటీసులు!

Advertisement

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య కేసు డ్రగ్స్ వైపు మళ్ళిన విషయం తెలిసిందే. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య కేసులో తన ప్రియురాలు రియా చక్రవర్తితో పాటు పలువురు ప్రముఖులను విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో మరికొన్ని కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా యువ హీరోయిన్లు శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్ పేర్లు బయటకు వస్తున్నాయి.

అయితే వీరిద్దరూ కూడా ఈ వారంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఎన్‌సీబీ నోటీసులు జారీచేయనుందని సమాచారం వస్తుంది. అయితే రియాను విచారించగా పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లను బయట పెట్టింది. ఇక వారిలో శ్రద్ధా, సారాల పేర్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్‌సీబీ వారికి త్వరలోనే నోటీసులు జారీ చేయనుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here