సారా తో బ్రేక్ అప్ వల్లే సుశాంత్ ఆత్మహత్య

Advertisement

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన మృతి పై సీబీఐ దర్యాప్తు కూడా కొనసాగిస్తోంది. సుశాంత్ మృతిపై రకరకాల ఊహాగానాలు ఇప్పటికే తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా సుశాంత్ స్నేహితుడు సామ్యూల్ పెట్టిన ఇన్ స్టా గ్రామ్ పోస్టు పలు రకాల అనుమానాలకు దారి తీస్తుంది. సారా అలీఖాన్ తో బ్రేకప్ కూడా సుశాంత్ డిప్రెషన్ కు ఓ కారణమని పోస్ట్ లో పేర్కొన్నాడు.

అయితే కేదార్ నాథ్ సినిమా ప్రమోషన్స్ సమయంలో సుశాంత్‌, సారా ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నారు. వారిద్దరిది కూడా విడతీయలేని బంధమని అన్నాడు. వారు ఇద్దరు కూడా ఒకరు అంటే ఒకరికి చాలా ఇష్టమని తెలిపాడు. ప్రస్తుత ఈ రోజుల్లో అలాంటి రిలేషన్ షిప్ లు చాలా తక్కువగా ఉంటాయని పేర్కొన్నాడు. మూవీ మాఫియా ఒత్తిడి వల్లే సుశాంత్ కు సారా అలీఖాన్ దూరంగా ఉండొచ్చు అని అన్నాడు. ఇక సారా తో బ్రేక్ అప్ వలనే డిప్రెషన్ కు వెళ్లి ఆత్మహత్య చేసుకుండొచ్చని తాను వెల్లడించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here