సుశాంత్ మార్చిలో పెళ్ళి చేసుకుంటాన‌న్నాడు, తండ్రి కేకే సింగ్:

Advertisement

సుశాంత్ మార్చి లో పెళ్లి చేసుకుంటా అన్నాడు.. మార్చిలో అన్ని సవ్యంగా ఉంటె సుశాంత్ ఇప్పుడు ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుండేవాడు ఇవి వాళ్ళ నాన్న అయిన కేకే సింగ్ మీడియా తో పంచుకున్నముచ్చట్లు.. వివరాల్లోకి గత కొంతకాలం క్రితం సుశాంత్ రాజపుట్ ఆత్మహత్య అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది దానితో ఇప్పటి వరకు సుశాంత్ లైఫ్ లో ఎం జరిగింది. తన జీవితం ఎలా కొనసాగింది వంటి అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయినప్పటికి తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి అన్న పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియడం లేదు.

తనకు ఆర్థిక సమస్యలు లేవు అని పోలీస్ ల దర్యాప్తులో వెల్లడైంది అతని బంధువులు కూడా ఆ విషయాన్నీ వెల్లడించడం జరిగింది. ఇంకా చాలా మందికి వస్తున్న అనుమానుల ప్రకారం అతను ప్రేమ పరంగా ఒత్తిడి కి గురయ్యాడు అని వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్త్తున్నారు.. కానీ కచ్చితమైన రుజువులు మాత్రం అందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు గా కూడా లేవు. ఈ మధ్య మీడియా తో మాట్లాడిన సుశాంత్ తండ్రి గారు అయిన కేకే సింగ్ సుశాంత్ గురించిన మరి కొన్ని విషయాలను మీడియా తో పంచుకోవడం జరిగింది. సుశాంత్ లాక్ డౌన్ లో ఒంటరిగా గడిపే సమయం లో అతడికి ఏర్పడిన ఒత్తిడి వల్ల అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అయితే లాక్ డౌన్ కంటే ముందుగానే కేకే సింగ్ సుశాంత్ తో పెళ్లి విషయం ప్రస్తావించగా తాను మార్చి లో చేసుకుంటాను అన్న విషయాన్ని తెలియచేసాడంట తండ్రి కేకే సింగ్ కూడా నీకు నచ్చిన ఏ అమ్మాయి అయినా సరే.. నువ్వు ఇష్టపడితే ఆ అమ్మాయి తోనే నీ పెళ్లి జరిపిస్తాను అంటూ సపోర్ట్ కూడా అందించాడంట, అలాగే గతం లో సుశాంత్ లవ్ చేసినటువంటి అంకిత లోఖండే, కృతిస‌న‌న్‌ ల గురించి కూడా తనకి తెలుసు అంకిత ..ముంబైతో పాటు తమ స్వస్థలం పట్నాలోని ఇంటికి కూడా ఆమె వచ్చిందని పేర్కొన్నారు‌. కృతిస‌నన్‌ని కూడా ముంబైలో క‌లిసా.

రియా చ‌క్ర‌వ‌ర్తి గురించి మాత్రమే నాకేం తెలియ‌దు అంటూ అతని చివరి రోజుల్లోనే విషయాలను తెలియ చేసాడు. అయితే చనిపోవడానికి కొంతకాలం ముందు నుండి చాలా మూడి గా డల్ గా ఉండేవాడు కానీ కారణం మాత్రం తెలియదు అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here