సుశాంత్ చనిపోయే ముందు రోజు అకౌంట్లో నుండి 15 కోట్లు మాయం సంచలన నిజాలు బట్టబయలు

Admin - July 29, 2020 / 09:52 AM IST

సుశాంత్ చనిపోయే ముందు రోజు అకౌంట్లో నుండి 15 కోట్లు మాయం  సంచలన నిజాలు బట్టబయలు

సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య వెనుక రోజు రోజుకి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు సుశాంత్ ఆత్మహత్య పై కీలకంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే తాజాగా సుశాంత్ ఆత్మహత్య పై న్యాయం కోరుతూ తన సోదరి శ్వేతా కీర్తిసింగ్ డిమాండ్ చేశారు. “ఇప్పుడు కాక‌పోతే ఇంకెప్పుడూ నిజాలు బ‌య‌ట‌ప‌డ‌వు. జ‌స్టిస్ ఫ‌ర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్” అంటూ సోష‌ల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.

అలాగే సుశాంత్ సింగ్ ఆత్మహత్య పై తన తండ్రి కేకే సింగ్ కూడా పోలీసులను ఆశ్రయించాడు. సుశాంత్‌ స్నేహితురాలు అయిన రియా చక్రవర్తి పైన పట్నాలోని రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు కేకే సింగ్. రియాతో పాటు మరికొందరు స్నేహితులు సుశాంత్ దగ్గర నుండి డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడ్డారని అలాగే తన ఆత్మహత్యకు కారణం వీరే అని ఐదు పేజీలలో రాసి ఫిర్యాదు చేసాడు తన తండ్రి కేకే సింగ్.

అయితే ఇన్ని రోజులుగా ఈ కేసుకు సంబంధించిన ఎటువంటి విమర్శలు చేయని.. సుశాంత్‌ కుటుంబం ఇప్పుడు రియాపై ఫిర్యాదు చేయడంపై చర్చనీయ అంశంగా మారింది. అలాగే తాజాగా సుశాంత్ సింగ్ అకౌంట్ లో నుండి రియా చక్ర‌వ‌ర్తికి 15 కోట్ల రూపాయలు ట్రాన్స్‌ఫ‌ర్ అయిన‌ట్లు పోలీసులు కూడా గుర్తించారు.

ఒకవైపు నెపోటిజంపై బాహాటంగానే విమ‌ర్శ‌లు చేసిన న‌టి కంగ‌నా ర‌నౌత్ బీటౌన్‌లో పెద్ద చ‌ర్చ‌ను లేవ‌నెత్తారు. అలాగే క‌ర‌ణ్ జోహార్, ఆదిత్య చోప్రా సుశాంత్‌ను బెదిరించార‌ని పెద్ద ఎత్తున ఆరోపనలు వచ్చాయి. ఈ క్రమంలో యష్ రాజ్ ఫిల్మ్స్ ఛైర్మన్ ఆదిత్య చోప్రా వాంగ్మూలాన్ని ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ నిర్మాణ సంస్థ సుశాంత్‌తో మూడు సినిమాలు తీయడానికి ఒప్పందం చేసుకుంది. కానీ రెండు సినిమాలు మాత్ర‌మే నిర్మించిన‌ట్లు తెలుస్తోంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us