ఈడి ఎదుట హాజరైన రియా చక్రవర్తి

Advertisement

ముంబై: హీరో సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి పై ఆరోపణలను ఎదుర్కొంటున్న రీయా చక్రవర్తిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారించారు. విచారణను వాయిదా వేయాలని రీయా పెట్టుకున్న అభ్యర్థను అధికారులు నిరాకరించడంతో రియా విచారణకు హాజరయ్యారు. సుశాంత్ సింగ్ బ్యాంక్ ఖాతా నుండి రూ. 15 కోట్లు రియా అకౌంట్ కు బదిలీ సుశాంత్ తండ్రి పాట్నా పెట్టిన కేసును ఆధారంగా చేసుకొని ఈడీ అధికాలు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.

రీయా తన సోదరుడైన సోయక్ తో కలిసి విచారణకు హాజరయ్యింది. దాదాపు 8 గంటల పాటు రీయాను అధికారులు విచారణ చేశారు. అలాగే సోయక్, రీయా మేనేజర్ శృతి మోదీ వాంగ్మూలాలను రికార్డ్ చేశారు. సుశాంత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్ధార్థ్ ను కూడా అధికారులు విచారణకు పిలిచారు. తన కేసును పాట్నా నుండి ముంబైకి బదిలీ చేయాలన్న రీయా అభ్యర్థనను తిరస్కరించాలని బీహార్ ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. సుశాంత్ సింగ్ కేసును విచారించడానికి ముంబై వచ్చిన ఎస్పీ వినయ్ తివారిని ముంబై పోలీసులు బలవంతంగా క్వారంటైన్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీని పై బీహార్ అధికాలు ఆగ్రహం వ్యక్తం చేయగా, తివారీని ముంబై అధికారులు వదిలిపెట్టారు. తనను నిర్బంధించి, సుశాంత్ కేసును ముంబై పోలీసులు నిలిపివేశారని తివారీ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here