Vivo Company : జీవిత భాగస్వామి వద్దు.! మొబైలే ముద్దు.. అంటున్న వాళ్లెంత మందో తెలుసా.?
NQ Staff - December 13, 2022 / 12:58 PM IST

Vivo Company : అవును నిజమే.! మొబైల్ మన జీవితంలో ఎంత ఎక్కువ ఇంపార్టెన్స్ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏడాది పిల్లవాడి దగ్గర్నుంచీ, ఏళ్లు గడిచిపోయిన ముసలి తాత వరకూ మొబైల్‌ని విరివిగా యూజ్ చేస్తున్న వాళ్లు చాలా మందే.
వివో సంస్థ చేసిన ఓ సర్వేలో భాగంగా, మొబైల్ యూసేజ్ వల్ల వైవాహిక సంబంధాలు దెబ్బ తింటున్నాయని తేల్చారు. చాలా మంది తమ జీవిత భాగస్వామితో గడిపే సమయం కన్నా, మొబైల్‌తోనే ఎక్కువ పే సమయం గడుపుతున్నట్లుగా ఈ సర్వేలో తేలింది.
భార్యా భర్తల ప్రేమకు అడ్డంకిగా మారిన మొబైల్ ఫోన్.!
హైద్రాబాద్, చెన్నై, పూణె, బెంగుళూరు,ముంబయ్, అహ్మదాబాద్ తదితర వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 1000 మంది పాల్గొన్న ఈ సర్వే మొబైల్ వినియోగదారులకు కుటుంబంతో గడిపే సమయ ఆవశ్యకతను గుర్తు చేయడమే తమ వుద్దేశ్యమని ఈ యూనిట్ తెలిపింది.
మొబైల్‌తో కాలక్షేపం చేస్తున్న వారిలో దాదాపు వివాహ బంధంలో వున్న 73 శాతం మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ఈ సర్వేలో తేలింది. జీవిత భాగస్వామి పక్కనే వున్నప్పటికీ మొబైల్‌తోనే ఎక్కువ కాలక్షేపం చేస్తున్న వారి సంఖ్య ఇది. అలాగే మొబైల్‌తో వున్న టైమ్‌లో తన భాగస్వామి ప్రేమగా మాట్లాడుతున్నా 70 శాతం మంది చిరాకు పడుతున్నారట.
జీవిత భాగస్వామితో అందమైన జీవితం గడపాలనీ, వీలైనంత ఎక్కువ టైమ్ కలిసి కాలక్షేపం చేయాలనీ, అలాంటి వారి ఆశల్ని మొబైల్ ఫోన్లు నాశనం చేస్తున్నాయనీ అలా నాశనమైపోతున్న బంధాలు 83 శాతంగా వుందని ఈ సర్వే తేల్చింది.
ఇది కేవలం సర్వే తేల్చిన నిక్కమైన నిజాలే కానీ, మొబైల్ వాడకం నుంచి ప్రస్తుత పరిస్థితుల్లో ఎవ్వరినైనా దూరం చేయడం సాధ్యమయ్యే పనేనా.?